రూ.50లక్షల అదనపు కట్నం.. ప్రాణాలు విడిచిన డాక్టర్..
posted on Jun 7, 2021 @ 11:46AM
చదువుకున్న వాడికంటే అదేదో కులం వాడు మేలు అన్నట్లు.. ఎంత సదివిన సంకారం లేని చదువు బూడిదలో పోసిన పన్నీరే అని చెప్పాలి. ఈ మధ్య చదువుకున్నవాడు, చదువుకొని వాడు అని తేడాలు లేకుండా దారుణాలు చేస్తున్నారు.. అవాంఛనీయ సంఘటనలకు అటు పరోక్షంగాను ఇటు ప్రత్యేక్షంగాను పాల్పడుతున్నారు.. చదువెందుకు..? చదువెందుకు? చదువెందుకు రా? అంటే నలుగురిలో దీపమై వెలిగేందుకురా? అన్న పదం పక్కన పెట్టి అధిక కట్నం కావాలి.. పిల్లలను వేదించడాని ఆ చదువును వాడుతున్నారు. నేటి తరం యువత.. తాజాగా డాక్టర్ చదుకున్న వ్యక్తి కూడా అధిక కట్నం కోసం పెళ్లిని వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.. చూడండి ఏం జరిగిందో..
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగాధర్ నాయక్ కడప ఎల్‌ఐసీ కార్యాలయంలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె లిఖిత (27) తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నూన్‌సావత్ శ్రావణ్‌నాయక్‌కు ఇచ్చి 2017లో పెళ్లి జరిపించారు. ఆ సమయంలోనే కట్నంగా 50 తులాల బంగారం ఇచ్చారు.
పెళ్లి జరిగింది. పెళ్లి జరిగితే సెట్ అవుతారు అని అందరు మాట్లాడుకున్నట్లు గానే.. పెళ్లి అనంతరం శ్రావణ్‌కు ముంబయిలో పీజీ జనరల్ మెడిసిన్ చేసేందుకు సీటు వచ్చింది.. దాంతో భార్యతో కలిసి ముంబై కి మక్కం మార్చారు..అక్కడే కాపురం పెట్టాడు. వీరికి 18 నెలల పాప ఉంది.స్థలం మారగానే అందరిలో మార్పు వచ్చినట్లు. ముంబయి కె వెళ్లి అక్కడి నీళ్లు పడంగానే శ్రావణ్‌లో చాలా మార్పు వచ్చింది. చదువుకున్న వ్యక్తి లో కి మూర్ఖుడు బయటపడ్డాడు. ఇచ్చిన కట్నం చాలదంటూ పుట్టింటి నుంచి రూ.50లక్షల అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం స్టార్ట్ చేశాడు. భర్త తీరుతో మనస్తాపం చెందిన లిఖిత గతంలో ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లిఖితను పుట్టింటికి తీసుకొచ్చేశారు. ఫిబ్రవరి నుంచి ఆమె ప్రొద్దుటూరులోనే ఉంటోంది. ఈ నెల ఒకటో తేదీన శ్రావణ్ నాయక్ ప్రొద్దుటూరుకు వచ్చి అదనపు కట్నం కావాలని లిఖితను వేధించాడు.
తాను కోరినంత కట్నం ఇస్తేనే లిఖితను కాపురానికి తీసుకెళ్తానని లేకపోతో పుట్టింట్లోనే ఉంచుకోవాలని తెగేసి చెప్పాడు. లిఖిత తల్లి దండ్రులను హెచ్చరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన లిఖిత మూడో తేదీన బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన అల్లుడు శ్రావణ్‌నాయక్, అతని తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని లిఖిత తండ్రి గంగాధర్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.