పెళ్ళికి రెడీ.. అదే టైం లో ప్రియుడితో ఎగిరేందుకు స్కెచ్..
posted on Jun 7, 2021 @ 11:24AM
అబ్బాయిది మహబూబ్ నగర్ జిల్లా. అమ్మాయిది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్.. ఇద్దరి కుటుంబాలు వాళ్ళకి పెళ్లి కుదిర్చారు.. వాళ్ళిద్దరి పెళ్లి నిన్న ఉండడంతో అమ్మాయి వాళ్ళు పెళ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శనివారమే వరుడి గ్రామానికి చేరుకున్నారు. పెళ్లి పనిలో ఒక్కడు ఉంటే అదేదో పనిలో ఇంకొకడు ఉన్నట్లు, నిన్న పెళ్లి పీటలపై కూర్చున్న వధువు అదే పనిగా సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తుండడం, అందరికి అనుమానం వచ్చింది.. ఈ టైం లో ఎవరితో మాట్లాడుతుందని. పెళ్లి ముందు పెట్టుకుని అంత అత్యవసరమైన పని ఏముంటుందని బంధువులు నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఇంతకీ మీరు ఆ విషం ఏంటని అనుకుంటున్నారా.. అవును మీరు అనుకున్నదే కానీ మరో ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ ను తెలుసుకోవాలంటే పూర్తి వార్త చదవండి..
పెళ్ళికి రెడీ అయిన ఆ పెళ్లి కూతురికి ఒక లవ్ స్టోరీ ఉంది.. పెళ్లి పెట్టుకుని సెల్ ఫోన్ లో మాట్లాడింది తన ప్రియుడితోనే.. అంటే కాదండోయ్ అతనితో మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపింది.. ఇది పక్కన పెడితే ఆ పిల్ల ఎంత బద్మాష్ పిల్లనో సుడుర్రి ఇగ.. ఈ వరుడితో పెళ్లి అయ్యాక.. రాత్రికి ప్రియుడితో కలిసి ఎగిరిపోవాలనుకుందంటా.. సూడు ఈ కాలం పిల్లలు ఎలా తయారు అయ్యారో.. పెళ్లి ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పాలిగాని గిట్ల ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని.. ప్రియుడితో చేకేస్తే పాపం గా పిలగాని పరిస్థితి ఏంగావాలి..
ఇక గీవిషయం పెద్దలకు దెల్వడంతో.. ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలన్న యువతి ప్లాన్ బెడిసికొట్టింది. అదే సమయంలో అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసిన వరుడి తరపు బంధువులు అతడు చెప్పింది విని విస్తుపోయారు. ఆమె, తను గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని సదరు యువకుడు చెప్పాడు. తర్వాత అతడి సెల్‌ఫోన్‌లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను చూసి అంతా షాకయ్యారు. వెంటనే వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారించిన పోలీసులు ఎవరూ కేసు పెట్టకపోవడంతో ఇద్దరినీ వదిలేశారు. ఇరు వర్గాల అంగీకారంతో వధూవరులు ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదు.