ఉద్యోగం పేరుతో.. ప్రభుత్వ అధికారి కమిట్మెంట్.. చివరికి ఇలా..
posted on Jun 12, 2021 @ 7:24PM
కమిట్‌మెంట్ ఈ మాట వినగానే అందరికి గుర్తుకు వచ్చేది సినిమా ఇండస్ట్రీ.. ఇలాంటి చిన్న వార్త వినిపించగానే అందరి కళ్ళు ఒక్కసారిగా ఆ విషం మీద పడి రచ్చ రచ్చ చేస్తారు.. ఎందుకంటే సినిమా అంటే క్రేజ్ ఉంటుంది కాబట్టి.. జనాలకు కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలని మోజు ఉంటుంది కాబట్టి.. సినిమా ఇండస్ట్రీ లో జరిగితే అందరికి తెలుసు కాబట్టి ప్రశ్నిస్తారు.. మరి అదే రోజులు సమాజంలో జరిగే కమిట్మెంట్స్ గురించి ఎంత మంది ప్రశ్నిస్తున్నారు.. రోడ్డు ఎక్కి వాళ్లకు న్యాయం జరగాలని ధర్నాలు చేస్తున్నారు..ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. తాజాగా ఉద్యోగం ఇప్పిస్తాను అని ఒక మహిళకు కమింట్మెంట్ అడిగాడు ఒక ఉగ్యోగి.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి.. నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే ఏపీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువతిని నేరుగా కమిట్‌మెంట్ అడిగిన ఉన్నతాధికారి బాగోతం బయటపడింది. ఇలా మనదేశంలో మన రాష్ట్రాల్లో బయటపడని సంఘటనలు ఎన్నో ఉన్నాయి..
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. శారీరక వాంఛలు తీర్చుకుని ఉద్యోగం ఇవ్వలేదని.. వెళ్లిన ప్రతిసారీ మళ్లీ కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. బాధితురాలి కథనం మేరకు.. ఇద్దరు మధ్యవర్తులు ఉద్యోగం ఇప్పిస్తామని కేఆర్ పురం ఐటీడీఏ ఉన్నతాధికారి వద్దకు తీసుకెళ్లారని యువతి తెలిపింది. ఆయన తణుకులో వార్డెన్ ఉద్యోగం ఇప్పిస్తానని.. తనను కమిట్‌మెంట్ అడిగాడని చెప్పింది. ఉద్యోగం కోసం ఆశతో.. గత్యంతరం లేక ఆయనకు లొంగిపోయానని.. పలుమార్లు ఆయన తనతో తీసుకెళ్లారని ఆరోపించింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం అడిగినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. వెళ్లిన ప్రతిసారీ మళ్లీ తనతో రమ్మంటూ వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఉద్యోగం రాకపోగా.. లొంగిపోయి మోసపోయానని.. తనలా మరో అమ్మాయికి జరగకూడదనే ఉద్దేశంతోనే బయటపెడుతున్నానని ఆమె ఆవేదన చెందింది. ఈ వీడియో సీఎం జగన్ వరకూ వెళ్లాలని.. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంంటోంది.