నిబంధనల ఉల్లంఘన వల్లే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చి వేత
posted on Jun 22, 2024 @ 12:14PM
నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్‌డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో సీఆర్‌డిఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి, శ్లాబ్ కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు, నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్‌డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సీఆర్‌డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సీఆర్‌డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి లో స్థలం కబ్జా చేసి... వైసీపీ కడుతున్న పార్టీ ఆఫీస్ ని కూల్చేసిన సిఆర్డిఎ అధికారులు కూల్చేసిన తర్వాత బోర్డు మీద చూస్లే బోట్ యార్డ్ అని ఉంది.
17 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, అందులో 2 ఎకరాలలో పార్టీ ఆఫీస్ను జగన్ కడుతున్నారు.
ఇది బకింగ్ హామ్ కెనాల్ దగ్గర లో ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఇది. కేవలం 1000 రూపాయలకే ఈ స్థలాన్ని లీజు ఇవ్వడం టూ మచ్ అని నెటిజన్లు అంటున్నారు.
ఇది కృష్ణ బ్యారేజ్ కి దగ్గర లో ఉంది. ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైసిపి కడుతున్న పార్టీ నిర్మాణాన్ని కూల్చివేయడం పట్ల పలువురు హ ర్షం వెలిబుచ్చారు.
అధికారం తలకెక్కిన జగన్ ఏకంగా తాడేపల్లిలో 202/ఎ 1 సర్వే నెంబర్లోని 2ఎకరాల ఇరిగేషన్ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. జగన్. 2 ఎకరాల్లో భవనాలు కట్టి మిగిలిన 15 ఎకరాలు నొక్కేయాలని వైకాపా నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం అసలే లేదు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం 17 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేయాలని చూశారు. ఇది జగన్ ఎత్తుగడ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఆర్డీఏ, ఎంటిఎంసి, రెవెన్యూ శాఖలు ఇరిగేషన్ భూమిని వైసీపీకి హ్యాండోవర్ చేయలేదు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను కబ్జా చేసింది.
వైసిపి కార్యాలయం నిర్మాణానికి కనీసం ముందస్తు దరఖాస్తు చేసుకోలేదు వైసీపీ ప్రభుత్వం. ప్లాన్ కోసం కూడా వైసీపీ దరఖాస్తు చేయలేదు
ఇరిగేషన్ భూమిని కబ్జా చేసి, ఏ ఒక్క అనుమతి లేకుండా వైసిపి కార్యాలయ నిర్మాణం జరిగింది.
వైసీపీ కబ్జాలపై టిడిపి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఇంతకు ముందు ఫిర్యాదు చేశారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీఆర్డీఏ, ఎంటిఎంసీ కమిషనర్లకు వేర్వేరుగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఏంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది. వైసీపీ కబ్జా చేసిన ఇరిగేషన్ భూమి స్వాధీనం అయ్యింది.
వైసీపీ కార్యాలయం కట్టిన ఆ 2 ఎకరాలు బోటు యార్డ్ స్థలమని, మత్యకారులకి చెందిన స్థలమని చెప్తున్నారు.
మత్స్యకారులకు చెందిన 2 ఎకరాల బోటు యార్డ్ స్థలాన్ని కబ్జా చేసి, పార్టీ ఆఫీస్ జగన్ రెడ్డి కడుతున్నట్లు తెలుస్తోంది.
స్థలాన్ని ఏడాదికి రూ. 1000 లెక్కన 33 ఏళ్లకి లీజుకి జగన్ ప్రభుత్వం ఇచ్చింది.కోట్ల రూపాయల విలువైన స్థలం కేవలం 1000 రూపాయలకే లీజు కు ఇవ్వడం దారుణమని పరిశీలకులు అంటున్నారు.
ప్రభుత్వం మారటం తో మత్స్యకారుల ఫిర్యాదు మేరకు జగన్ అక్రమంగా కడుతున్న పార్టీ ఆఫీస్ ని టిడిపి ప్రభుత్వం కూల్చేసింది. నిబంధనల ప్రకారమ నోటీసులు ఇచ్చి, నోటీసులకు స్పందించకపోవటం తో అధికారులు కూల్చేశారు.అది అక్రమ కట్టడమని, నిర్మాణం ఆపాలని జగన్ ప్రభుత్వానికి సిఆర్డిఎ అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు ఆపలేదు.
జగన్ రెడ్డి కబ్జా నుంచి 2 ఎకరాల స్థలాన్ని కూటమి ప్రభుత్వం కాపాడింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ మత్స్యకారుల అవసరానికే ఉపయోగిస్తారు.
అప్పట్లో బోట్ యార్డ్ ప్రాపర్టీ అని బోర్డులపై రాసి ఉన్నప్పటికీ జగన్ వైసీపీ పార్టీ ఆఫీస్ పేరుతో కబ్జా చేశారు.
నాడు ప్రజావేదిక కూల్చివేతను జగన్ సమర్ధించారు. "అక్రమంగా కట్టిన భవనంలో ఉంటూ ప్రజలకు సంబంధించిన పరిపాలన నిర్ణయాలు తీసుకోవటంపై అంతరాత్మను ప్రశ్నించుకోవాలి".అని జగన్ వ్యాఖ్యలు చేశారు. మరి ప్రభుత్వ బోటు యార్డు స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టే ముందు జగన్ అంతరాత్మను ప్రశ్నించుకోలేదా?
కూల్చివేత తో ఆపకుండా శిథిలాలు తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆనవాళ్లు కనిపించకుండా చేయాలని, అక్కడ మరో నిర్మాణం చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కూల్చివేసిన చోట అభివృద్ధికి బాట వేయాలన్న వాదన వినిపిస్తోంది. తాడేపల్లిలోని 17 ఎకరాల ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీళ్లు కల్పించేందుకు, 2019కి ముందు టిడిపి ప్రభుత్వం సంకల్పించింది. అదే మంచి నీటి ప్లాంట్ ఏర్పాటుకి కూడా సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. అయితే మంచి ఖరీదైన స్థలం కావటంలో, నాడు సియంగా ఉన్న జగన్ రెడ్డి దీని పై కన్నేసి ఉంచారు. తాడేపల్లి వాసులకు మంచి నీటిని అందించాల్సిన చోటుని కబ్జా చేసి, తమ పార్టీ కార్యాలయం కోసం జగన్ కబ్జా చేసారు.ప్రభుత్వం మారడంతో వైసీపీ యత్నానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, వైసీపీ కబ్జా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడింది.
.