లేడీ ప్రహ్లాదుడు.. ముద్రగడ క్రాంతి!
posted on Jun 22, 2024 @ 1:00PM
ముద్రగడ పద్మనాభరెడ్డికి వయసు పెరగడం వల్ల చాదస్తం బాగా పెరిగింది. దానికితోడు తన ప్రాణానికి ప్రాణమైన జగన్ పార్టీ మటాష్ అయిపోవడంతో ఆయనకి బుర్ర తిరిగిపోయంది. వీటితోపాటుగా ఆయన తన కులం కూడా మార్చుకుని ‘పద్మనాభరెడ్డి’గా మారిపోవడంతో ప్రస్తుతం ఆయన దానికి సంబంధించిన కన్‌ఫ్యూజల్లో వున్నారు. పైగా ఒకప్పుడు హవా నడిపించిన ఆయన మాట ఎవరూ వినడం లేదు. పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదు. ఇన్ని ఒత్తిడులు మీద పడటం వల్ల ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. శుక్రవారం నాడు ఆయన విడుదల చేసిన ఒక వీడియో ఆయన చాదస్తానికి పరాకాష్టగా నిలిచింది. తనను ఎవరో వేధిస్తున్నారట.. అలా వేధించడం ఎందుకు.. ఒకేసారి నా కుటుంబాన్ని చంపేయండి అని ఆయన ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాపులకు పవన్ కళ్యాణ్ ఏమేం చేయాలనే విషయంలో ఉచిత సలహాలు ఇచ్చేశారు. తమరు ఇప్పుడు ‘కాపు’ కాదు.. ‘రెడ్డి’.. మా విషయాలు మాట్లాడే అర్హత తమరికి లేదు అని కాపు నాయకులు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా, ఆయన అనవసరంగా కాపుల విషయాల్లోకి దూరుతున్నారు.
కాకపోతే, ముద్రగడ ఎంత హిరణ్యకశిపుడి తరహాలో వ్యవహరిస్తున్నప్పటికీ, ఆయన ఇంట్లోనే లేడీ ప్రహ్లాదుడి జననం జరిగింది. ఆ లేడీ ప్రహ్లాదుడు తండ్రికి వాత పెట్టడంలో చాలా యాక్టివ్‌గా వున్నారు.. ఆ లేడీ ప్రహ్లాదుడు మరెవరో కాదు.. ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె ముద్రగడ క్రాంతి. ముద్రగడ పద్మనాభం ‘కాపు’గా వున్న సమయంలో ఆయన పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ‘రెడ్డి’గా మారిన తర్వాత చేసిన వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించారు. ‘‘నాన్నా.. మీరు పేరు మార్చుకున్నారు గానీ, ఆలోచనా విధానం మార్చుకోలేదు.. ముందు ఆలోచనా విధానం మార్చుకోండి’’ అని అట్లకాడ కాల్చి వాత పెట్టినట్టు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్స్.లో ఆమె ఒక పోస్టు పెట్టారు. ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. కానీ, ఆయన తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం నాకు చాలా ఆందోళన కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఏనాడూ ప్రశ్నించని నా తండ్రికి ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించే అర్హత వుందా? పేరు మార్చుకున్న తర్వాత ఆయనకి కాపుల గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడుంది? సమాజానికి ఏం చేయాలనే విషయంలో పవన్ కళ్యాణ్‌కి స్పష్టత వుంది. నా తండ్రికి మాత్రం ఏ అర్హతా లేదు. ఇప్పటికైనా నా తండ్రి శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి, విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నాను. ఇంకోసారి పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తాను’’ అని క్రాంతా ఆ పోస్టులో పేర్కొన్నారు. లేడీ ప్రహ్లాదుడు క్రాంతి పెట్టిన పోస్టు చూసి, ఇప్పటికైనా ఆధునిక హిరణ్యకశిపుడు ముద్రగడ పద్మనాభం తన పవన్ కళ్యాణ్ ద్వేషాన్ని మానుకుంటే మంచింది.