కుప్పంలో వైసీపీ మూకల దాడి
posted on May 23, 2024 9:29AM
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని తంబిగాని పల్లెలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డాయి.
5వ వార్డు కౌన్సిలర్ సెల్వం, తెలుగుదేశం వార్డు మాజీ సభ్యుడు ఆశోక్, పార్టీ కార్యకర్తలపై వైసీపీ మూకలు రాడ్లు, కర్రలతో దాడి చేశాయి. ఈ దాడిలో వైసీపీ నేతలు సాయికిరణ్, యమరాజ్, నాగరత్నం తదితరులు ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.
ఈ దాడిలో కౌన్సిలర్ సెల్వం, మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ఎ గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు.