సెల్ఫ్ గోల్‌కి మరో పేరు వైసీపీ!
posted on Jun 25, 2022 @ 11:49AM
ఎన్ని చేసినా పోలింగ్ శాతం (64.17) గణనీయంగా తగ్గింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కన్నా ప్రస్తుత ఉప ఎన్నికలో ఓట్లు పెరిగినా, పోలింగ్ శాతం మాత్రం తగ్గడం తో నేతల్లో గుబులు మొదలైంది. ఓటరిచ్చే తీర్పు ప్రధాన భూమికను పోషించనుండటంతో నేతలు విశ్లే షణలలో తలమునకలై ఉన్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయిన తర్వాత ఏమి చేసినా ప్రయోజనం శూన్యం. ఇపుడు పిల్లలకి కధలు చెప్పి తినిపించినట్లు బతిమాలుకోవాలి. కానీ ఓటర్లు మరీ పాలుతాగే, పాలు అన్నం తినే అమాయత్వంలో లేరు. పాలకులకంటే తెలివిగలవారు, ఓట్లు ఎవరికి వేయాలి, తాము ఇప్పటివరకూ ఏమి కోల్పోయామన్నది పాలకులకంటే బాగా ఎరిగినవారే! ఇపుడు వైసీపీ వర్గీయులే ఓటర్ల కాళ్లు పట్టుకోవాల్సిన పాత్ర గట్టిగా పోషించాలి.
ఆత్మకూరు నియోజకవర్గంలో 2,13,338 మంది ఓటర్లు ఉండగా 1,37,038 మంది తమ ఓటు హక్కు వినియో గించుకున్నారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్డ్డి సొంత మండలమైన మర్రిపాడులో 59.8 శాతం, వైసీపీకి గట్టి పట్టున్న అనంతసాగరం మండలంలో సైతం 64.63 శాతం ఓట్లు పోలుకావడం నేతలను కలవర పాటుకు గురి చేస్తోంది.
ఇక ఆత్మకూరు మండలంలో 63.69 శాతం, ఏఎస్పేటలో 62.8 శాతం, సంగంలోజర్ల లో 67.9 శాతం మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తమ్మీద ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనే అంశాల పై అధికార పార్టీనేతల్లో తర్జనభర్జనలు మొదలయ్యాయి. కానీ యుద్ధానంతరం గాయాలతో చర్చించుకో వడం వల్ల ప్రయోజనమేమిటి? ఇక వున్నన్నాళ్లయినా బుద్ధిగా అందరితో కనీసం నవ్వు మొహంతో కనపడుతూ కాలం గడిపేయడమే మేలు!