కొవిడ్ టీకా వేసుకుని కోటీశ్వరాలైంది!
posted on Nov 10, 2021 @ 4:40PM
కొవిడ్ టీకా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణకు రక్షణ కవచం. కొవిడ్ టీకా తీసుకుంటే వైరస్ సోకినా.. ప్రాణపాయం తప్పుతుందన్నది వైద్యుల మటా. అందుకే కరోనా పై పోరాటం లో మానవాళి చేతిలో ఉండే ఏకైక అస్త్రంగావ్యాక్సిన్ నిలిచింది. అందుకే ప్రపంచ దేశాలన్ని తమ ప్రజలకు కొవిడ్ టీకాను అందిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ ను యజ్ఞంలా చేపట్టాయి. అయితే కొందరు జనాలు భయంతో టీకా తీసుకునేందుకు భయపడుతున్నారు. అలాంటి వాళ్లను ప్రోత్సహించేందుకు, టీకా తీసుకునేలా ముందుకు వచ్చేందుకు కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు, బహుమతులు ప్రకటించాయి. అలా కొవిడ్ తీసుకున్న ఓ మహిళ కోటీశ్వరురాలైంది.
ఆస్ట్రేలియాలో కొన్ని కార్పోరేట్ సంస్థలు టీకా తీసుకునే వారిని ప్రోత్సహించాయి. ఇందుకుగాను లాటరీ పద్ధతిని ఎంచుకుంది. టీకా తీసుకున్న వారికి ఒక యూనీక్ కోడ్ ఇచ్చి లక్కీ డ్రాను తీసింది. ఈ లక్కీ డ్రాలో సిడ్నీకి చెందిన జాన్నే ఝ అనే యువతు ఏకంగా కోటీశ్వరరాలుగా మారింది. లాటరీ లో తన పేరు రావడంతో భారత కరెన్సీ ప్రకారం సుమారు ఐదు కోట్ల నలబై లక్షల రూపాయిల సొమ్మును ఆమె సొంతం చేసుకుంది. జాన్నే ఝ వయసు ఇరవై ఐదు. ఇంత తక్కువ వయసులోనే కోటీశ్వరురాలిగా మారింది ఆ యువతి.
కరోనా సమయంలో ప్రభావితమైన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. దీంతో దేశంలోని కొన్ని సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి. మిలియన్ డాలర్ వ్యాక్స్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టాయి. దీని ప్రధాన ఉద్దేశం దేశంలోని ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించి.. టీకా తీసుకునేలా చేయడం. ఇందుకు గానూ వారు లాటరీ పద్దతిని ఎన్నుకున్నారు. దీనిని గత నెల చివరిలో ప్రారంభించారు. అనుకున్న దానికంటే భారీ స్థాయిలో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పెద్ద మొత్తంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు మొగ్గు చూపారు. దీంతో ఒకానొక సమయంలో ఎన్ రోల్ చేసుకునే వెబ్ సైట్ కూడా క్రాష్ అయ్యింది. ఈ కార్యక్రమ నిర్వాహకులు కొన్ని గంటల్లోనే సైట్ ను పునరుద్ధరించారు. ప్రారంభమైన నాడే సుమారు మూడు లక్షల మంది టీకా కోసం నమోదు చేసుకున్నారు. దీనితో పాటే వారందరి పేర్లను లక్కీ డ్రాగా తీశారు.ఇందులో విజేతగా నిలిచిన ఆమెకు సుమారు 4.2 మిలియన్ డాలర్లను ఇచ్చారు. మరో 3100 మందికి లక్కీ డ్రాలోనే విజేతలుగా ప్రకటించి వివిధ రకాలైన బహుమతులు అందజేశారు.