గగనతలంలో మహిళా శక్తి...!
posted on Sep 8, 2020 @ 3:23PM
దేశ ప్రగతిరథం ముందుకు కదలడానికి మహిళా శక్తి ఎంతో అవసరం అని నేటి పాలకులు గుర్తిస్తున్నారు. అనేక రంగాల్లో రాణిస్తున్న మహిళలకు వైమానిక దళంలోనూ ప్రవేశం కల్పిస్తున్నారు. అయితే 1932 లో ప్రారంభమైన భారత వాయుసేనలో 1990 వరకు మహిళలకు ప్రవేశం లేదు. ఆ తర్వాతే మహిళలకు స్థానం కల్పించారు. అది కూడా చాపర్స్, రవాణాకు సంబంధించిన విమాన సర్వీసుల్లోనే మొదట ప్రవేశం కల్పించారు. 991లో మహిళలు చేరడానికి అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు వాయుసేనలో ఉన్న మహిళల సంఖ్య కేవలం13 శాతం మాత్రమే. 1999 నాటి కార్గిల్ వార్ సందర్భంగా 'గుంజన్ సక్షేనా' తో పాటు ఆమె బ్యాచ్ మేట్ 'శ్రీ విద్య రాజన్' చేతన్ హెలికాప్టర్ ద్వారా గాయపడ్డ సైనికులను తరలించడం, నిఘా ను కొనసాగించడం చేశారు. చాపర్స్ , హెలికాప్టర్ వరకే ఉన్న అనుమతిని ఆ తర్వాత ఫైటర్ జెట్ నడపడానికి కూడా ఇచ్చారు. అయితే 2015 తర్వాతనే ఫైటర్ జెట్ లో మహిళలకు ప్రవేశం కల్పించారు.
వాయుసేనలో చేరేందుకు అనేక ఆడంకులను అధిగమించి 2002లో డాక్టర్ పద్మ బందోపాధ్యాయా 'ఎయిర్ మార్షల్' ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు. కానీ పోరాటానికి ముందు వరుసలో నిలించేందుకు మాత్రం 2015 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రధానమంత్రి మోడీ వైమానిక రంగానికి సంబంధించిన అన్నింటిలో మహిళ భాగస్వామ్యం ఉండాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో అది సాధ్యమైంది. మోడీ తీసుకున్న ఆ నిర్ణయం అనేకమంది భారతీయ మహిళల స్వప్నాన్ని నిజం చేసింది. వివిధ దేశాల్లో, సమాజాల్లో, వ్యక్తుల మధ్య, ముఖ్యంగా భారతీయ వైమానిక రంగంలోకి తరతరాలుగా గుడుకట్టుకున్న లింగవివక్షను రూపుమారింది. 2018 లో ఫ్లయిట్ లెఫ్టినెంట్ 'అవని చరుద్వేది' ఒంటరిగా మిగ్ -21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా అవని చతుర్వేది తన అనుభవాలను పంచుకుంటూ 'ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక మిషన్, దాన్ని ఆపరేట్ చేస్తున్నది ఆడనా మగనా అనేది దానికి తెలియదు. అది ఇద్దరి విషయంలో ఒకేలా నడుచుకుంటుంది. కాబట్టి ఆడ అయినా, మగ అయినా సమర్థవంతంగా నడపగలిగితే చాలు' అంటూ తోటి సహచరులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె ఇచ్చిన స్పూర్తితో భవన్ కాంత్, మోహనా సింగ్ వంటి మిగతా మహిళలు కూడా సమర్థవంతంగా వాయు సేనలో చేరి తమ సత్తా చాటారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొదటి మహిళా పైలట్ భవన్ కాంత్ . 2019 లో కంబాట్ మిషన్ ను సమర్థవంతంగా ఫైటర్ జెట్ నడిపి మహిళల శక్తిసామర్ధ్యాలను విశ్వవ్యాపితం చేశారు. ఇక మోహనా సింగ్ అధునాతనమైన 'హావాక్' ఫైటర్ జెట్ ను నడిపి భారతదేశ చరిత్రలో తన పేరును పదిల పరుచుకున్నారు. వీరి ప్రతిభ, శక్తి సామర్ధ్యాలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ సంవత్సరం (2020) రాష్టప్రతి రాంనాధ్ కొంవింద్ చేతుల మీదుగా నారిశక్తి పురస్కారంతో గౌరవించింది. వీరి స్ఫూర్తితో ఎంతో మంది యువతులు భారత సైన్యంలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.