అసెంబ్లీలో ఆమోదించనున్న బిల్లులు
posted on Sep 8, 2020 @ 1:52PM
క్యాబినేట్ లో నిర్ణయం
ఈనెల 9న సభ ముందుకు రెవెన్యూ కొత్త చట్టం
కొత్త చట్టం వచ్చేవరకు నో రిజిష్ట్రేషన్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో భారీ సంష్కరణలకు శ్రీకారం చుట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు తీసుకురావాలని ముందుగానే అనుకున్నప్పటికీ జాతీయ ఎన్నికలు, ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ సమయంలో ముఖ్యమంత్రి కె. చంధ్రశేఖర్ రావు కొత్త చట్టాల గురించి, వచ్చే మార్పుల గురించి కూలంకషంగా ఆలోచించి ముసాయిదాలుగా వాటికి సభ ముందుకు తీసుకువస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈనెల 9న అసెంబ్లీలో ప్రవేశపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చేవరకు రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లకు సెలవులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ శాఖలకు సంబంధించిన ఆర్టినెన్స్ లను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
- ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020
- ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020
- తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లు
- పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ – గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు–2018 సవరణ బిల్లు
- తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లు
- తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020
- ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020
- ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002
- ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్
- టిఎస్ బిపాస్ బిల్
- తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లు
- ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లు
ఈ ఆర్డినెన్స్ ల తో పాటు క్యాబినెట్ కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు, కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా 17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కూడా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయించిన ఆర్డినెన్స్ లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ అనుమతితో వాటిని అమలు చేస్తారు.