అల్వాల్ లో వరస హత్యలు.. కారణాలు ఇవే..
posted on Jun 26, 2021 @ 4:38PM
ఈ కాలంలో ఒకరు పుట్టడం తల్లి దండ్రుల ఇష్టం.. కానీ మరొకరిని చంపడం ఎవరు ఎవరికి ఇచ్చిన అధికారం.. వరుస హత్యలు అల్వాల్‌లో కలకలం రేపుతున్నాయి. మొన్న ఓ వృద్దురాలిని కిరాయిదారుడే అంతమొందించగా, శనివారం మరో మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పూలమ్మ(40) అల్వాల్‌లో వెంకటాపురంలోని ఓ గుడిసెలో ఒంటరిగా నివాసం ఉంటూ..ఆమె జీవితం గడవడం కోసం రోజు వారీగా అడ్డాకూలీగా పని చేస్తుంది. రోజు పనికొవెళ్లి వచ్చిన డబ్బులతో ఆమె జీవితం గడపడం..ఆమె రోజు వారి కృత్యాలు.
ఈ క్రమంలో శనివారం ఉదయం పూలమ్మ గుడిసెలో నుంచి బయటకు రాలేదు. రోజు ఈ టైం బయటికి వచ్చే పుల్లమ్మ బయటికి ఎందుకు రాలేదని స్థానికులు అనుమానం వచ్చింది. చివరికి కొంత దైర్యం చేసి లోపలి వెళ్లి చూశారు. పుల్లమ్మ మంచం మీద పడుకుని ఉంది కానీ ఆమె ముఖంపై తీవ్ర గాయాలు కనిపించాయి. లొకాలికి వెళ్లిన వాళ్ళు ఒక్కసరిగా షాక్ తిన్నారు. ఒకటి రెండు సార్లు పుల్లమ్మ పుల్లమ్మ అని పిలిచి చూశారు. ఆయినా ఆమె పలకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జీపు వేసుకుని ఘటన స్థలానికి చేరుకొని.. మహిళ చనిపోయినట్లు నిర్దారించారు. ఆమె మృతిపై విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్, వేలి ముద్రల నిపుణులను రంగంలోకి దింపి వివరాలను సేకరించారు. పూలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పుల్లమ్మ మరణం పై స్థానికుల్లో ఆందోనళ కలిగిస్తుంది. ఇంట్లో ఉన్న పుల్లమ్మ ఇంట్లో ఎలా చనిపోయిందని ఆవేదన చెందుతున్నారు.
పుల్లమ్మ హత్యపై అనుమానాలు..
పులమ్మ దారుణ హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ వ్యక్తి గుడిసెలకు చెందిన స్థలం తమదని, గుడిసెలను ఖాళీ చేసేందుకు ప్రయత్నించగా.. పూలమ్మ అడ్డుకుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో, పూలమ్మపై సదరు వ్యక్తి దాడికి యత్నించగా, ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే, హత్యకు భూ వివాదమే కారణమా.? లేక ఇతర కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలతో పాటు, బాధితురాలి కాల్ లిస్టు అధారంగా కేసును త్వరలోనే చేధిస్తామని అల్వాల్ సీఐ గంగాధర్ తెలిపారు.