భార్య, ఇద్దరు అత్తలు కలిసి అల్లుడ్ని చంపేశారు..
posted on Jun 16, 2021 @ 4:40PM
మద్యం బాబులకు మందేస్తే కిక్కు కానీ చూసేవాళ్ళకి చాలా చిరాకు గా ఉంటుంది. మద్యం తాగడం వల్ల చాల కుటుంబాల్లో నిత్యం గొడవలు కొని సార్లు ఈ మద్యం మత్తులో ఎందరో చంపుకున్న విషయాలు ఉన్నాయి. తాజాగా మద్యం మత్తులో ఒక వ్యక్తికి ఏం జరిగిందో చూడండి. కొంత మంది ఆడవాలను చూస్తే జాలివేస్తుంది.. మరి కొంత మంది ఆడవాళ్లను చూస్తే గౌరవించాలని ఉంటుంది. కానీ వీళ్ళు ఆడవాళ్లు కాదు. కిలేడీలు.. కీలాడీలు, మాయలేడీలు,అది గుంటూరు జిల్లా. గోరంట్ల శివారులో అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తూ హత్యకు గురైన వ్యక్తి మర్డర్ మిస్టరీని జిల్లాలోని నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగారు. అతన్ని ఎవరు చంపేచారు. ఆ వాచ్ మెన్ ని ఎవరు చంపారు.. ఎందుకు చంపారు..దానివెనుక కారణాలు ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంతున్నారా..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల అగ్రహారానికి చెందిన నల్లబోతు వెంకటేశ్వర్లు, అతని భార్య రామలింగమ్మ ఐదు సంవత్సరాల క్రితం గుంటూరు నగరానికి బతుకుదెరువు కోసం వలస వచ్చారు. జిల్లా శివారులోని గోరంట్ల సమీపంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్వర్లు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య రామలింగమ్మ కూడా నగరంలోని ఓ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. భార్యాభర్తలిద్దరూ అపార్ట్‌మెంట్‌లో ఓ గదిలో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకటేశ్వర్లు అత్తమామలు కూడా అతను పనిచేసే అపార్ట్‌మెంట్ పక్కనే మరో అపార్ట్‌మెంట్‌లో పనికి కుదిరారు. వెంకటేశ్వర్లు అత్త పేరు నాగేంద్రం. ఆమె చెల్లి వీరమ్మ కూడా ఇళ్లలో పనులు చేసుకుంటూ వీరితో పాటే ఉంటోంది. వెంకటేశ్వర్లుకు మద్యం అలవాటుంది. ఇటీవల వెంకటేశ్వర్లు భార్య రామలింగమ్మతో తరచూ మద్యం తాగొచ్చి గొడవపడుతున్నాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన రామలింగమ్మ అతనిని చంపాలని నిర్ణయించుకుంది. ఆమె ఈ విషయాన్ని తన తల్లి నాగేంద్రంతో, పిన్ని వీరమ్మతో చెప్పింది.
వాళ్లు కూడా అల్లుడిని చంపేందుకు సాయం చేస్తామని చెప్పడంతో వాళ్ళ పథకానికి బలం చేకూరింది. ప్లాన్ వేశారు ఆ పథకం అమలు చేయాలనుకున్నారు. ఈ నెల 11న రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చి గొడవపడి.. అనంతరం నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు మెడకు చీరతో ఉరి బిగించి కాళ్లూచేతులూ పట్టుకుని ముగ్గురూ హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత.. వెంకటేశ్వర్లు తల్లి అంకమ్మకు ఫోన్ చేసి రామలింగమ్మ, నాగేంద్రం, వీరమ్మ అక్కడి నుంచి పరారయ్యారు. కోడలి మాటలతో అనుమానం వ్యక్తం చేసిన వెంకటేశ్వర్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసు విచారణను సవాల్‌గా స్వీకరించిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా వెంకటేశ్వర్లును హత్య చేసినట్లుగా ముగ్గురూ ఒప్పుకున్నారు. భర్త వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా చంపాలని నిర్ణయించుకుని అతనిని భార్య హతమార్చడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.