ఇంతకీ... విజయమ్మ ఎందుకు ఏడ్చినట్టు?
posted on Jul 9, 2024 @ 4:59PM
సోమవారం నాడు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ భార్య విజయమ్మతోపాటు, కుమారుడు, వైసీపీ అధినేత జగన్, కుమార్తె, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్సార్ వారసురాలు షర్మిల, వీళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముక్తాయింపుగా విజయమ్మ శ్రద్ధాభక్తులతో ప్రార్థించారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో జగన్ తల్లి దగ్గరకి వచ్చి కొద్ది క్షణాలు నిల్చున్నారు. అప్పుడు కొడుక్కి దగ్గరగా వెళ్ళిన విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలామందిని ఓదార్చిన అనుభవం వున్న జగన్, తల్లిని మాత్రం ఓదార్చకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కన్నీరు మున్నీరు అవుతున్న విజయమ్మను ఆమె సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఇతర బంధువులు ఓదార్చారు. విజయమ్మని ఓదార్చడం సంగతి అటుంచితే, ఇప్పుడు చాలామందిలో తలెత్తుతున్న ప్రశ్న ఇంతకీ... విజయమ్మ ఎందుకు ఏడ్చినట్టు?
* తన భర్త వైఎస్ రాజశేఖరెడ్డి గుర్తొచ్చా?
* జగన్ దారుణంగా ఓడిపోయినందుకా?
* త్వరలో జగన్ మళ్ళీ జైలుపాలు అవబోతున్నాడనా?
* తాను గెలిపించమని ఓటర్లని రిక్వెస్ట్ చేసినా తన కుమార్తె షర్మిల ఓడిపోయిందనా?
* షర్మిలకు ఆస్తి విషయంలో అన్యాయం జరుగుతోందనా?
* కొడుక్కి దూరమైపోయాననా?
* వదినా అని గౌరవంగా పిలిచే వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా తేలలేదనా?
* ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని తాను వేరేవాళ్ళని ఉద్దేశించి అంటే, అది తన కొడుక్కే తగిలిందనా?