దిశ కేసులా ఎందుకు డీల్ చేయరు!
posted on Jun 8, 2022 @ 1:34PM
దేనికయినా ఒక హద్దూ ఆపు వుండాలి. ఒక సంఘటన పూర్వాపరాలు తెలిసీ నత్తనడకన చర్యలు సాగ నిస్తే ఎవరు హర్షిస్తారు? జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసు ఏడురోజులుగా సాగదీసి నీరుగారుస్తున్నారు. పోలీసు లు నిందితులను గుర్తించామని, వారిలో కొందరిని పట్టుకున్నామని, ఆ పట్టుకున్నవారిలో మైనర్లు వున్నా రని, వారి వివరాలు చెప్పడం కుదరదని సీపీ ఆనంద్ అన్నారు. పోనీ మిగతావారి విషయంలో కూడా గట్టి చర్యలు తీసుకోవడానికి ఇన్ని రోజులు చేయడంలో అర్ధమేమిటి? వీడియో రికార్డింగ్‌లు పరిశీలించడం, నిందితులను గుర్తించడం, ఫోటోలూ బయటికి రావడం జరిగిపోయాయి, కానీ పోలీసుబాస్ మాత్రం ఎందుకో అరెస్టులకు నిదానం ప్రధానమన్న విధానాన్నే అనుసరించడం చూస్తున్నాం.
దిశ కేసులో హుటాహుటిని నిందితులను పట్టుకోవడం, ఎన్‌కౌంటర్ చేసేయడమూ వేగంగా చేయగలిగిన పుడు ఈ కేసును నత్తనడకన సాగించడం పోలీసు వ్యవస్థ మీద అపనమ్మకం కలిగించింది. నిందితులను ఎందుకు కాపాడుకునే మార్గం చూస్తున్నట్టు? ఒకరు మాజీ మంత్రి కుమారుడని, మరొకడు హోంమంత్రి మనవడు అనీ తాత్సారం చేస్తున్నట్టే వుంది. ఇది చాలా సీరియస్ కేసుగా మారిందే ఈ రెండు అంశాలు వెలుగు చూడటంతో. అన్నిరేప్ కేసుల్లో రెండింతలు వుత్సాహం చూపే పోలీసు శాఖ ఈ కేసులో ఇన్ని రోజులు మీనమేషాలు లెక్కిస్తూ తీసుకోవాల్సిన చర్యలకు తటపటాయించడం నిందితులను రక్షించడా నికే! అసలు రేప్ జరిగిందని చెబుతున్ కారులో అసలు ఎమ్మెల్యే కొడుకు లేడని డిసీపీ విలేకరులకు సవినయంగానే చెప్పారు. కానీ ఆనక వీడయోలో బయటపడిన తర్వాత కేసు రూపమే మారింది. అవును ఆ కారులో ఎమ్మెల్యే కొడుకు కూడా దర్శనమిచ్చేడు. అదీ వాస్తవమే, కానీ అతగాడు సగం దూరమే వుండి ఆ తర్వాత వెళిపోయాడని కొత్త వార్త వినిపించేరు. మరి ఆ కొద్ది సమయమయినా ఆ కుర్రాడు చాలా బుద్ధి గా కూచుని వున్నాడా అన్నది అనుమానమేగదా! చిత్రమేమంటే, సీపీ ఆనంద్ ఆ ఎమ్మెల్యే పేరు చెప్ప డానికి, ఆ దొరికిన ఇన్నోవా ఎవరిదనేది చెప్పడానికీ ధడుసుకోవడం! పైగా నిందితులు మద్యం సేవించినట్టు గట్టి ఆధారాలేవీ చెప్పలేదు.
ఇంతటి కేసు గురించి వారినోట వీరినోటా అయినా సీఎం కేసీఆర్ వినేవుంటారు. సందేహం లేదు. మరి దీన్ని గురించి ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తమ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేదు, ముఖ్యంగా భాగ్యనగరం బహు బాగు అంటూ ప్రచారాలు మాత్రం వూదరగొట్టిన ప్రభుత్వం ఇటీవల ఇలాటి కేసులు పెచ్చుమీరిపోతున్న సంగతి తెలియకుండా వుంటుందా? పరువు హత్యల్ని పేపర్లలో చూసి తెలుసుకుంటున్న తెలంగాణా సీఎంకి మరి మంత్రిగారి అబ్బాయి నిందితుడని అంటు న్న ఈ కేసును పట్టించుకోవడం ప్రబుత్వ ప్రతిష్టను కాపాడుకోవడానికి వహిస్తున్న మౌనమే అనుకోవాలి. ఇది ఎంతవరకూ న్యాయం. అదే మరెవరిదో హత్యా, రేప్ కేసో అయితే వెంటనే నిందితులను పట్టుకోవ డం, కఠిన శిక్ష విధించడానికి ఏమాత్రం తాత్సారం చేయనీయని అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం చాలా నిదానంగా, నిమ్మళంగా వుండటం దారుణం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి 40 రోజులలో నిందితులను శిక్ష పడేలా చేస్తే రాష్ఠ్ర ప్రజలు సంతోషిస్తారు.