మీరు వాట్సాప్ వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..
posted on Jul 6, 2021 @ 4:48PM
గత కొంత కాలంలో మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం మానేశాం.. ఏదైనా సమాచారం చేరవెయ్యాలంటే ఎక్కువగా వాట్సాప్‌లో మన సమాచారాన్ని చేరవేస్తున్నాం. ఒకరకంగా చెప్పాలంటే వాట్స్ అప్ తో మనం సంసారం చేస్తున్నాం అని చెప్పాలి. ఇక వాట్స్ ఆప్ వాడేటప్పుడు మనం రోజూ వ్యక్తిగతంగానో లేదా గ్రూప్‌లోనో వేర్వేరు వ్యక్తులతో చాట్ చేస్తుంటాం. కొన్నిసార్లు మన మాటలతోనే మన స్టేటస్ తోనో పక్కవాళ్ళను విసిగించొచ్చు. లేదంటే మన మాటలు పక్కవాళ్ళను నచ్చకపోవచ్చు.. లేదా వేరే దురుద్దేశంతోనే కొందరు వాట్సాప్‌లో మన నంబర్‌ను బ్లాక్ చేస్తుంటారు. కారణాలు ఏవైనా కావచ్చు.. అవతలి వ్యక్తి మన నంబర్ బ్లాక్ చేశారనే విషయం మాత్రం మనకు వెంటనే తెలియదు. వాట్సాప్ యూజర్ గోప్యతా ప్రమాణాల ప్రకారం ఎవరైనా మన నంబర్‌ను బ్లాక్ చేస్తే ఆ విషయం మనకు చెప్పకూడదు. మరి ఇతరులు మనల్ని బ్లాక్ చేశారనే విషయం మనకు ఎలా తెలుస్తుంది..? తెలుసుకోవడమెలా?
వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారనే అనుమానం వస్తే.. వాళ్ల చాట్ విండో ఓపెన్ చేస్తే వాళ్ళు చివరగా ఎప్పుడు చూశారు? ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసి చూస్తే.. ఒకవేళ అవతలి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేస్తే లాస్ట్‌సీన్, స్టేటస్‌లను మీరు చూడలేరు. అలానే సదరు వ్యక్తి సెట్టింగ్స్‌లో లాస్ట్‌సీన్ ఆప్షన్ డిజేబుల్ చేసినా చివరగా ఎప్పుడు చూశారనేది మీకు తెలియదు.
మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేసుంటే వారి ప్రొఫైల్ ఫొటోను మీరు చూడలేరు. అయితే, ఒక్కోసారి అవతలి వ్యక్తి ప్రొఫైల్ పెట్టకపోయినప్పుడు మనకు ఫొటో కనిపించదు. ఆ సందర్భంలో మనల్ని బ్లాక్ చేశారని అనుకోకూడదు. అప్పటితోనే కృంగిపోవద్దు.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటే కొంచం ఓపిగ్గా ఉంది చూడాలి..
మీరు ఎవరికైనా వాట్సాప్ ద్వారా మెసేజ్ లేదా కాల్ చేస్తే వెళ్లడం లేదా? ఎన్నిసార్లు చేసినా ఫోన్ కాల్ కలవడం లేదా? మెసేజ్ వారికి చేరినట్టు కూడా డెలివరీ నోటిఫికేషన్ రావడం లేదా? అయితే సదరు వ్యక్తి మీ నంబర్ బ్లాక్ చేశారనే భావించాలి. అయితే కొన్నిసార్లు నెట్‌వర్క్, వైఫై సమస్య వల్ల కూడా మెసేజ్ లేదా కాల్ వెళ్లకపోవచ్చు. ఒకవేళ మీ నెట్‌వర్క్ సరిగ్గా ఉండీ కాల్స్ వెళ్లకపోతే మీరు అనుమానించాల్సిందే.
మిగిలిన వాటితో పోలిస్తే ఈ ట్రిక్‌తో మిమ్మల్ని బ్లాక్ చేశారా? లేదా? అన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు. ముందుగా మిమ్మల్ని బ్లాక్ చేశారని భావించే వ్యక్తి నంబర్‌తో కలిసి ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేయండి. ఒకవేళ మీకు సదరు కాంటాక్ట్‌తో గ్రూపు క్రియేట్ చేసేందుకు అనుమతి లేదనే మెసేజ్ కనిపిస్తే అవతలి వ్యక్తి మీ నంబర్ బ్లాక్ చేశారని అర్థం. ఒకవేళ గ్రూప్ క్రియేట్ అయితే మిమ్మల్ని బ్లాక్ చేయలేదని అర్థం. ఏది ఏమైనా దానికి ఇంత అవసరం లేదు.. వాళ్ళు బ్లాక్ చేస్తే మనం కూడా వాళ్ళను బ్లాక్ లో పెట్టి ముందుకు వెళ్లడమే మనిషి జీవితానికి పరమార్ధం.. వాళ్ళు బ్లాక్ చేశారు వీళ్ళు బ్లాక్ చేశారు అని ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న కాస్త పుణ్యకాలం కూడా గాలిలో కలిసిపోతుంది..