జీవవైవిధ్య సదస్సుతో ఒరిగిందేమిటి
posted on Oct 20, 2012 @ 12:16PM
జీవవైవిధ్యానికి ముందు 10 వేల మంది ప్రతినిధులు 138 దేశాలనుండి వస్తారని, దానిలో 15 దేశాల ఫ్రధానులు వస్తారని ప్రచారం జరిగింది కాని ఏ ప్రధానులూ రాలేదు. మన దేశం నుండి రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కాని అలాంటిదేమీ జరగలేదు సరికదా ప్రధాని వచ్చి ప్రసంగంచి వెళ్లిపోయారు తగినంత సమయం కాని, హామీలు కానీ ఏవీలేవు, 225 కోట్లరూపాయలు జీవవైవిధ్యానికి కెటాయించామన్నారు అది ఎన్ని ఏళ్లకో చెఫ్పనేలేదు. ప్రజల భాగస్వామ్యాన్ని ఎక్కువ చేయాలి కాని జరిగింది వేరు. కేవలం మేధావులు ప్రసంగాలు చేసి వెళ్లిపోయారు. అమలు ఎంతమేరకు చేస్తారనేది ప్రశ్నార్ధకమే. మనిషి స్ధిర జీవనం ఏర్పరుచుకున్న దగ్గర నుండి ఈ పరిస్థితులు తలెత్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత 30 ఏళ్లలో మనిషి ప్రకతిని వికతిగా మార్చేశాడు. ఇప్పటికే ఈ విషమ పరిస్థితులకు గానూ 10 కోట్లమంది చనిపోయారు. 2050 నాటికి పరిశ్రమలు 10 రెట్లు పెరుగుతాయని మేధావులు అంచనా వేస్తున్నారు. అంటే భావితరాల భవిశ్వత్తు ప్రశ్నార్ధకమే నన్నమాట..... ఎందుకంటే దానివల్ల కార్బన్ ఉద్ఘారాలు పెరుగుతాయి. మనిషి జీవనం అతలాకుతలమవుతుంది. ఇంత చేటున్న అగ్రరాజ్యాలు తమకేమీ పట్టవన్నట్లు చూస్తున్నాయి. ఈ సమావేశాలకు జర్మనీ, బ్రిటన్ అమెరికా, ప్రాన్స్ దేశాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సమావేశాలుకు వెళ్లే దేశాలు మొదటి సమావేశంలో అమలు జరపవలసిన విధివిధానాలనే అమలు చేయాలేదు. మరి ఎందుకు జరిపినట్టు ఈ సమావేశాలు రాబోయే తరాలకు ఏం సమాధానం చెబుతారో............