ప్లైట్లకంటె పచ్చ బస్సులే నయం
posted on Oct 20, 2012 @ 12:15PM
మనం ఏదన్నా ఊరు వెళుతున్నామనుకొండి మద్యలో మనం ఎక్కిన బస్పు ఆగిపోతే కండక్టరు మరొక బస్సును ఆపి ఎక్కించే అవకాశం ఉంది లేదా డిపోకు ఫోను చేసి మరొక బస్సును రప్పించి ఎక్కించే అవకాశం ఉంటుంది. అయితే ఈ మద్య సమయాన్ని ఆదాచేయాలని వేలుపోసి ఎయిర్ బస్ లో టికెట్టు రిజర్వేషన్ చేయించుకుంటే టైము రాకపోవడపో లేదంటే పూర్తిగా క్యాన్సిల్ చేయడమో జరుగుతుండటంతో ప్రయాణీకులు నానా అగచాట్లు పడుతున్నారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. ప్రయాణీకులు సమయానికి విలువనివ్వడం పెరిగిన తరువాత ప్రవేటు ఎయిర్ బస్లు తామర తంపరగా పుట్టుకొచ్చాయి. అయితే నాణ్యమైన సేవలు అందించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్రభుత్వం రంగంలో పనిచేసే విమానాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఏది ఏమైనా ప్రయాణీకులను యాతన పెట్టటంలో ఎవరికి వారే సాటి. అందుకు ఉదాహరణగా నిన్న అబుదబినుండి కొచ్చికి రావలసిన విమానం ప్రయాణీకులకు వాతావరణం బావుండలేదని తెలియపరచకుండా అత్యవసరంగా తిరువనంతపురంలో ల్యాండ్ చేసి ప్రయాణీకులను అసహనానికి గురిచేసింది. దాంతో ప్రయాణీకులలో ఒకరు ఎందుకు ఇంకా గమ్యస్థానాన్ని చేరుకుంటానికి లేట్ అవుతుందో తెలుసుకుందామని కాక్ పిట్ లో ప్రవేశించగానే పైలెట్ విమానంలోకి ఉగ్రవాది ప్రవేశించాడంటూ ఎయిర్ పోర్టు అధికారులకు అత్యవసర సందేశం పంపడం జరిగి గందరగోళానికి కారణమయ్యింది. ఎట్టకేలకు 7 గంటలు ఆలస్యంగా ప్రయాణీకులను గమ్యస్ధానానికి చేర్చింది.