Read more!

జూన్ 3.. చాలా చెడ్డ రోజు!

 

 

 

 

జూన్ మూడో తేదీ చాలా చెడ్డరోజులా కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల వల్ల రోడ్లు రక్తసిక్తమయ్యాయి.

 

 1. కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై హుజూరాబాద్ సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున బస్సు, లారీ, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో 25 మంది బస్సు ప్రయాణికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా వుంది.

2. హైదరాబాద్‌లో ఒక లారీ రోడ్డు మీద బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఒక లారీ మొదట ఒక మోటర్ బైక్‌ని ఢీకొంది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీలలో వున్న డ్రైవర్లు లారీల్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు.

3. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి పట్టణంలో రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగి మరణించారు.

4. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో రోడ్డు పక్కన వున్న లారీని ఒక ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో బస్సులో వున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

5. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం దగ్గర బ్రాండిక్స్ సంస్థకు చెందిన బస్సును లారీ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

6. నల్గొండ జిల్లా మునగాల దగ్గర ఓల్వో బస్సు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.. మొత్తంమీద జూన్ 3 చాలా డేంజరస్ డే మాదిరిగా కనిపిస్తోంది. అందువల్ల ప్రయాణికులూ.. జాగ్రత్త..