తెలుగువన్ లో నాట్స్ తెలుగు సంబరాలు ప్రత్యక్షంగా ప్రసారం
posted on Jul 5, 2013 @ 11:03AM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మూడో ద్వైవార్షిక వేడుకలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది తెలుగువన్.కాం.
(Click Here to Watch NATS LIVE)
http://www.teluguone.com/live/nats/
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మూడో ద్వైవార్షిక వేడుకలకు డల్లాస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ అందంగా ముస్తాబైంది. గురువారం సాయంత్రం విందు కార్యక్రమాలతో ప్రారంభమయ్యే వేడుకలు శనివారంతో ముగుస్తాయి.
ఈ సంబరాలకు నందమూరి నట సింహం బాలకృష్ణ ,కాజల్ అగర్వాల్ , నిషా అగర్వాల్, ఇలా ఎందరో సినీ ప్రముఖులు నాట్స్ సంబరాలకు విచ్చేస్తున్నారు. వీరితో పాటు.. కామెడీ స్టార్ ఆలీ.. కోన వెంకట్ , నిర్మాత సాయి కొర్రపాటి.. ఇలా ఎందరో సినీ దిగ్గజాలు సంబరాలకు తరలివస్తున్నారు. సినిమా నిర్మాణంపై సదస్సులు, వ్యాపార మెళుకువలపై చర్చా కార్యక్రమం, ఆధ్యాత్మిక సమ్మేళనం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహార్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రానున్నారు. అమెరికాలో తొలిసారిగా ఈటీవీ పాడుతా తీయగా..నిర్వహించిన బాలు.. నాట్స్ సంబరాల వేదికపై పాడుతా తీయగా ఫైనల్ నిర్వహించనున్నారు. ఇక కీరవాణి మ్యూజికల్ నైట్.. సంబరాలకు విచ్చేసిన వారిని సంగీత ప్రవాహంలో ముంచెత్తనుంది.. సంబరాలకు వచ్చే తెలుగు ప్రముఖుల జాబితా కూడా పెరిగింది. సభలో పాల్గొనేందుకు వచ్చిన అతిధులకు ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ సమీపంలోని ఒమ్ని, మారియట్, హాలిడేఇన్ లలో బసను ఏర్పాటు చేశారు.