ఓటేశాక చనిపోయింది
posted on May 8, 2014 @ 3:29PM
కాళ్ళూ చేతులు సరిగానే వున్న కుర్రకారుని ఓటేయడానికి రమ్మంటే ఇంట్రస్ట్ లేదని చెబుతారు. ఓటరుగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారు. అయితే బాధ్యత తెలిసిన వారు మాత్రం తమకు వయసు ఎంత మీద పడినా ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఈ ఎన్నికలలో శతాధిక వృద్ధులు అనేకమంది పోలింగ్ బూత్‌లకు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో అయితే వంద సంవత్సరాలు దాటిన వృద్ధురాలు ఆరోగ్యం బాగాలేకపోయినా, శరీరం సహకరించకపోయినా ఓటు వేయడానికి తపనపడింది. ఓటు వేసి వచ్చి ఉత్తమ పౌరురాలిగా తనను తాను నిరూపించుకుంది. పండంటి నిండు జీవితాన్ని చాలించింది. కృష్ణా జిల్లాలోని పి.నైనవరం గ్రామానికి చెందిన చిట్టి దుర్గమ్మ అనే శతాధిక వృద్ధురాలు ఓటు వేసి వచ్చిన కొద్ది సేపటికే కన్నుమూసింది.