హిందూపూరంలో గెలుస్తా.. సినిమాలు తగ్గిస్తా: బాలకృష్ణ
posted on May 8, 2014 @ 3:41PM
అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. హిందూపురంలో తన గెలుపు ఖాయమని నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. హిందూపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాలయ్య తెలిపారు. ప్రజాసేవ కోసం సినిమాలను కొంత తగ్గించుకుంటానని, పూర్తిగా దూరంకాబోనని బాలకృష్ణ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని బాలకృష్ణ తెలిపారు.