తెలంగాణకు వివేకా హత్య కేసు విచారణ?.. రఘురామ రాజు
posted on Oct 19, 2022 @ 12:48PM
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు విషయంలో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏపీలో అయితే సజావుగా సాగదనీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును అడుగడుగునా అడ్డుకుంటోందనీ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వివేక హత్య కేసు విచారణను ఏపీలో కాకుండా హైదరా బాద్ లేదా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. సునీత పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టుకు సీబీఐ ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా హత్య కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్న సంగతి వాస్తవమేనని పేర్కొంది. ఈ కేసు విచారణ ఏపీ నుంచి ఇరత రాష్ట్రానికి బదిలీ చేయాలని నిర్ణయిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో కేసు విచారణపై వివేకానంద కుమార్తె ఎన్.సునీతారెడ్డి వ్యక్తం చేసిన అనుమానాలు, అభ్యంతరాలు అక్షర సత్యాలని సుప్రీం కు సీబీఐ సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నది. పేర్కొన్నది. అంతేగాక రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ ఆరోపించింది. సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి అంగీకరించిన సీఐ శంకరయ్యపై రాష్ట్ర ప్రభుత్వం సస్పె న్షన్‌ను ఎత్తి వేయడమే కాక, ఆయనకు ప్రమోషన్ కూడా ఇచ్చిన విషయాన్ని సీబీఐ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభు త్వం చేసిన మేలుకు మాటమార్చడం ద్వారా సీఐ బదులు తీర్చుకున్నారని సీబీఐ పేర్కొంది.
అందుకే వాంగ్మూలం కోసం సీబీఐ ఒత్తిడి తెస్తోందంటూ ఆరోపించార ని తెలిపింది. సాక్షులకు ముప్పున్న విషయం కూడా వాస్తవమే నని, ఏకంగా సీబీఐ అధికారులనే బెదిరిం చారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వేరే రాష్ట్రానికి కేసు విచా రణను బదిలీ చేస్తే తమకు అభ్యంతరం లేదని సీబీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. సీబీఐ వివేకా హత్య కేసులో పోలీసులు, ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్పడం, అంతే కాకుండా ఈ కేసులో నిందితులు,పోలీసులు కుమ్మక్కయ్యాని సీబీఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ కేసును ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న వైఎస్ సునీత పిటిషన్‌కు బలం లభించినట్లయిందని న్యాయవర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి
ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారే అవకాశం ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అంచనా వేశారు. అదే జరిగితే అది ఏపీ సర్కార్ కు పెద్ద ఎదురుదెబ్బే కాకుండా అవమానం కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇంత వరకూ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీరే కారణమని ఆయన విమర్శించారు.