విజయసాయి రెడ్డి కూతురు నుంచి డబ్బు వసూలు చేయాలి : హైకోర్టు
posted on Mar 5, 2025 @ 2:40PM
వైకాపా హాయంలో విశాఖ బీచ్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. సిఆర్ జడ్ నిబంధనలకు వ్యతిరేకంగా బీచ్ లో నిర్మాణాలు జరిగినట్టు న్యాయస్థానం గుర్తించింది. వైకాపా మాజీ నేత విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి కి చెందిన కంపెనీ విశాఖ బీచ్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టింది. దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. నేహారెడ్డి కంపెనీపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని , అలా చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశముంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. బీచ్ లో అక్రమ కట్టడాల కూల్చివేత ఖర్చు నేహారెడ్డి కంపెనీ నుంచి వసూలు చేయాలని కోర్టు అభిప్రాయపడింది. భీమిలి వద్ద నాలుగు రెస్ట్రో బార్ల అక్రమ నిర్వహణపై దాఖలైన పిల్ పై బుధవారం విచారణ జరిగింది.