సెప్టెంబర్ 25,26న అమెరికా తెలుగు సాహితీ సదస్సు.. కెనడా టొరంటోలో ఘనంగా ఏర్పాట్లు..
posted on Sep 6, 2021 @ 4:53PM
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు భాష ఔన్నత్యం మరోసారి వెలిగిపోనుంది. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జరగబోతోంది. ఇదే మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు కూడా.vanguru fo ఇందుకోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు.సెప్టెంబర్ 25, 26 తేదీల్లో టొరంటో, కెనడా ప్రధాన కేంద్రంగా ఆన్ లైన్ లో జరగబోతున్న ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
అమెరికా సాహితి సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ముందుకు వచ్చారు. నిర్వాహకులు ఆహ్వానాలు పంపగా.. వాళ్లంతా అంగీకరించారు. తమ ప్రసంగ ప్రతిపాదనలు పంపించారు. భారత దేశం నుంచి కొందరు లబ్ద ప్రతిష్టులు ప్రసంగించనున్నారు.సాహితీ సదస్సు లోనే పలు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. సాహిత్య సదస్సు చర్చా వేదికలు జరగనున్నాయి. కొందరికి జీవన సౌఫల్య పురస్కారం అందించనున్నారు నిర్వాహకులు.
సాహిత సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా చూపిన వక్తలందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అందరికి అందరికీ అవకాశం కల్పించడానికి సదస్సు జరిగే సమయాలని రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా పొడిగించారు. మొత్తం 20 గంటలకు పైగా సాహితి సదస్సు జరగనుంది.
యూఎస్ లో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున క సాహిత్య వేదిక మీద కలుసుకోవడం చరిత్రలో ఇదే మొదటి సారిని అంటున్నారు. ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించేలా ఆన్ లైన్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి ఆనందించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
రెండు రోజుల సాహిత్య సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూపే లింక్ లు (EST, Toronto Time 9:00 AM-7:00 PM)
September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1
September 26, 2021 YouTube: https://bit.ly/3mjgLYS
సాహితి సదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు..
త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వంలో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాలకు https://youtu.be/U4tX3dNHlKw
సదస్సుకు సంబంధించిన ఏ విషయానికైనా ఈ క్రింది వారిని సంప్రదించండి..
సంచాలకులు : లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com
వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, USA): vangurifoundation@gmail.com
సంధాన కర్తలు: విక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com,శాయి రాచకొండ (USA): sairacha@gmail.com
కార్యనిర్వాహక సంఘం సభ్యులు: యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల
నిర్వహిస్తున్న సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణా అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం