సీఈసీ వెబ్ సైట్ హ్యాక్.. కోటి ఫేక్ ఐడీ కార్డ్స్! ఈవీఎమ్ లు సేఫేనా?
posted on Aug 14, 2021 @ 11:22AM
దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. బ్యాంకింగ్ రంగాన్ని షేక్ చేస్తున్నారు కేటుగాళ్లు, సైబల్ ఛీటర్ల వలలో చిక్కుకుని జనాలు విలవిలలాడుతున్నారు. తాజాగా సైబర్ హ్యాకర్ల మరింతగా రెచ్చిపోయారు. ఏకంగా భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ను హ్యాక్ చేశారు. హ్యాకర్లు పదివేలకు పైగా నకిలీ ఓటర్ ఐడి కార్డులను సృష్టించారని తెలుస్తోంది. ఈ కేసులో మొరెనాకు చెందిన నలుగురు యువకులను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులకు గురువారం 24 ఏళ్ల విపుల్ సైనీ.. వందలాది నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేస్తు పట్టబడ్డారు. సైనీ విచారణలో అసలు సంగతి బయట పడింది.
అర్మాన్ మాలిక్ ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌లోని హర్దా నివాసి సైనీ పనిచేస్తున్నాడని.. 3 నెలల్లో 10,000 కంటే ఎక్కువ నకిలీ ఓటర్ ఐడీలను సృష్టించాడని తేలింది. మొరెనాలోని అంబాలో నివసించే 18 ఏళ్ల హరియోమ్ ప్రమేయం గురించి UP పోలీసులు MP పోలీసులకు సమాచారం అందించారు. హరియోమ్.. సైనీతో నేరుగా సంప్రదింపులు జరిపారని.. దానిని ఇతరులకు విక్రయించడానికి ID ని ఉంచారని తెలుస్తోంది. శుక్రవారం హరియోమ్‌తో సంబంధం ఉన్న 17 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి తన వద్ద కనీసం కోటి నిజమైన .. నకిలీ ఓటర్ IDలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు.
సిమ్ కార్డులు కొనడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆన్‌లైన్ మోసానికి ప్రధానంగా నకిలీ ఐడీలను ఉపయోగించే మోసగాళ్లకు డేటాను నిందితులు విక్రయించేవారు. పోలీసుల ప్రకారం ఈ టీనేజర్స్ వారు హరియోమ్ వద్ద పని చేస్తున్నట్లు తెలిపారు. వారు ఎంత డబ్బు సంపాదించారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇతర ముఠా సభ్యుల గురించి మరింత తెలుసుకోవడానికి ఎంపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులంతా పేద కుటుంబాలకు చెందినవారే. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా అర్మాన్ మాలిక్ ను గుర్తించారు పోలీసులు. నకిలీ ఓటరు ఐడి తయారు చేయడం గురించి మాలిక్ తనకు తెలియజేసేవారని సైనీ పోలీసులకు చెప్పాడు. అతను ఓటర్ ఐడి కోసం 100 నుండి 200 రూపాయలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. పని ఆధారంగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు వచ్చేవాని నింధితులు తెలిపారు.
ఫేక్ ఓటర్ కార్డులు, వెబ్ సైట్ హ్యాకింగ్ పై ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పందించారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లు (ఇరోస్) పౌరులకు సేవలను అందిస్తారని.. ఓటర్ ఐడి కార్డుల ముద్రణ సకాలంలో పంపిణీకి బాధ్యత వహిస్తారని చెప్పారు. AERO కార్యాలయం డేటా ఎంట్రీ ఆపరేటర్ తన ఐడి , పాస్‌వర్డ్‌ని సహరన్‌పూర్‌లోని నకుడ్‌లోని ఒక ప్రైవేట్ అనధికార సర్వీస్ ప్రొవైడర్‌కు చట్టవిరుద్ధంగా ఇచ్చారని తద్వారా అతను కొన్ని ఓటర్ కార్డులను ముద్రించగలడని ప్రతినిధి వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రతినిధి తెలిపారు. ఎన్నికల కమిషన్ డేటాబేస్ పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పారు.
ఎన్నికల కమిషన్ డేటా సురక్షితంగా ఉందని అధికారులు చెబుతున్నా.. వైబ్ సైట్ హ్యాక్ కావడంపై సంచనంగా మారింది. సీఈసీ కార్యకలాపాలన్ని రహస్యంగా జరుగుతుంటాయి. తాజా ఘటనపై సీఈసీకి భద్రత లేదని తెలుస్తోంది. మరోవైపు పోలింగ్ కేసం సీఈసీ ఉపయోగిస్తున్న ఈవీఎమ్ ల భద్రపైనా మళ్లీ చర్చ మొదలైంది. ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేయవచ్చనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. కొన్ని పార్టీలు ఈవీఎమ్ ల ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ట్యాంపరింగ్ కు ఎలాంటి అవకాశం లేదని సీఈసీ చెబుతున్నా.. వెబ్ సైట్ హ్యాక్ కావడం ఇప్పుడు చర్చగా మారింది. వెబ్ సైట్ కే పూర్తి రక్షణ లేనప్పుడు ఈవీఎమ్ లు ట్యాంపరింగ్ కావలని ఎలా చెప్పగలమనే ప్రశ్న వస్తోంది.