ఢిల్లీలో యోగి.. ఏంటి కథ ? సీఎం పదవి పోయినట్టేనా!
posted on Jun 11, 2021 @ 1:41PM
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే వుంది. ఈ ఎనినిమిది నెలలు అక్కడ అధికారంలో ఉన్న, బీజేపీకి మాత్రమే కాదు, అన్ని పార్టీలకు అత్యంత కీలకం. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా, గత ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ, మరో అద్భుత విజయం కోసం, తహతహ లాడుతోంది. ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా, కొవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పడరాని పాట్లు పడుతోంది. అందులో భాగంగానే, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్,రాష్టంలో పర్యటించి పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించి, కేంద్ర నాయకత్వానికి నివేదికను సమర్పించారు.
ఈ నేపద్యంలో, ముఖ్యమత్రి యోగీ ఆదిత్యనాథ్ రెండురోజుల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఊహాగానలకు తెరతీసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, తమ పర్యటనలో భాగంగా, పార్టీ త్రిమూర్తులు, ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా,పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తునారన్నవార్త, మీడియా మేతకు కొదవలేకుండా చేసింది. ఇప్పటికే. సంతోష్ పర్యటన నేపధ్యంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగీల మధ్య విబేధాలు ఉన్నట్లు, కధనాలను నడిపిన మీడియా,మరో అడుగు ముందుకేసి, యోగీకి ఉద్వాసన తప్పదని బ్రేకింగ్’ ఇచ్చింది. అయితే, అదేమీ లేదని స్వయంగా సంతోష్ మీడియాకు వివరణ ఇచ్చారు.
అదలా ఉంటే, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, డిల్లీ పర్యటన నిస్సందేహంగా ఎన్నికల సమీపిస్తున్న సమయంలో తీసుకోవలసిన నష్ట నివారణ చర్యలపై చర్చించేందుకే అని పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి.అదే సమయంలో ఇప్పడు ముఖ్యమంత్రి మార్పు ఉండదనీ స్పష్టం చేస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ ఉడే అవకాసం ఉందని,ఆ విషయం చర్చించేందుకే, యోగీ ముఖ్య నేతలు ముగ్గురినీ కలుస్తున్నారని తెలుస్తోంది.
ఆదిత్యనాథ్ అనుచరులు మాత్రం కొవిడ్, వాక్సినేషన్ సంబందిత విషయాలతో పాటుగా రాజకీయ అంశాలు కూడా చర్చకు రావచ్చని, అంటున్నారు.ముఖ్యంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, బీజేపీ పై సమాజ్ వాదీ పార్టీ ఆధిక్యత సాధించడం ఆందోళన కలిగించే అంశంగానే పార్టీ భావిస్తోంది. మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జగరనున్న నేపధ్యంలో జరిగిన పంచాయతి ఎన్నికల్లో ఎస్పీ ఆధిక్యత సాధించడంతో, అన్ని కోణాలలో విశ్లేషణ జరుగుతుందని, అవసరమైన దిద్దుబాటు చర్యలు ఉంటాయని, పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అయితే ప్రస్తుతం ఉన్నఖాళీలను భర్తీ చేయడం వరకే విస్తరణ ఉంటుందా, లేక సంస్థాగతమార్పులతో కలిపి భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా .. అన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
ఇదిలా ఉంటే, కొవిడ్ సృష్టించిన బ్యాడ్ ఇమేజ్’నుచి అదుత్యనాథ్ ప్రభుత్వం బయట పడుతోందని పార్టీ వర్గాలతో పాటుగా విపక్షాలు కూడా గుర్తించాయి. అందుకే, వాక్సిన్ మీద విశ్వాసం లేదని, తాను తీసుకోనని, వాక్సినేషన్ వ్యతిరేక ప్రచారం సాగించిన మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అదినేత అఖిలేష్ యాదవ్, తండ్రి ములాయంతో కలిసి వాక్సిన్ తీసుకోవడమే కాదు, అందరూ తీసుకోవాలని తండ్రీ, కొడుకులు ఇద్దరూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో పాటుగా, వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, అందుకే, అఖిలేష్ యాదవ్, నెగటివ్ నుంచి పాజిటివ్ పదాలకి ట్యూన్ మార్చారని అంటున్నారు. అదే విధంగా థర్డ్ వేవ్ వచ్చినా సంర్ధవంతంగా తట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో, బీజేపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.