కుంభమేళాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుణ్యస్నానం
posted on Feb 20, 2025 @ 1:16PM
ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో కకేంద్ర మంత్రి, తెలుగుదేశం ఎంపీ కే.రామ్మెహన్ నాయకుడు పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించి గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చిన రామ్మోహన్ నాయుడు తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు చెప్పారు.
ఇలా ఉండగా మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో భక్తులు పుణ్యస్నానాల కోసం పోటెత్తుతున్నారు. మంగళవారం నాటికే మహాకుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య 55 కోట్లకు చేరుకుంది. మహాకుంభ్ ముగిసే నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.