ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా ప్రమాణం
posted on Feb 20, 2025 @ 12:06PM
27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బిజెపి అధికారంలో వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తో బాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వారి చేత ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ శర్మ, సాహిబ్ సింగ్, అశీశ్ సూద్, మంజీందర్ సింగ్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణం చేశారు.
ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.