రాష్ట్రంనుంచి ఇద్దరూ లేక ముగ్గురు.
posted on Oct 18, 2012 @ 12:11PM
రాష్ట్రంనుండి కేంద్రక్యాబినేట్ కు ఇద్దరు లేక ముగ్గుర్ని తీసుకుంటారని తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనుండి ముగ్గురిని తీసుకుంటారని అందులో భాగంగా కోస్తాంద్రప్రాంతం నుండి చిరంజీవికి ఖరారయినట్లే, ఆ మేరకు చిరంజీవికి అధిష్టానం సంకేతాలు పంపారు. రాష్ట్రవర్గాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. రాయలసీమనుండి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అనంతపురం ఎంపి అనంత వెంకటరామిరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే నిజాయితే పరుడిగా ప్రజల్లో పట్టున్న నాయకుడిగా సూర్యప్రకాశ్ కే ఎక్కువ అవకాశం ఉందని తెలుసింది. ఇక తెలంగాణ నాయకులుగా రేణుకా చౌధరి, సర్వే సత్యన్నారాయణ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులక కోసం నాయకులు ప్రాంతాల్ని, కులాలని బయటకు తెచ్చారు. ఢిల్లీలో వీరంతా లాబీలు చేస్తున్నారు. క్యాబినెట్ విస్తరణ శుక్ర లేదా శని వారాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. దసరా ఉత్సవాలను రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ లోని తన స్వస్థలంలో జరుపుకోతలపెట్టినందున దసరాకంటే ముందుగానే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు.