అవన్నీ ఉత్తుత్తి మాటలే
posted on Oct 18, 2012 @ 12:05PM
భారత్ జీవవైవిద్యం గురించి చెబుతున్నవన్నీ ఉత్తుత్తి మాటలే అని చెప్పేమాటలకు అవలంభిస్తున్న పద్దతులకు మద్య చాలా అంతరం ఉందని దేశం లోని పేరెన్నికగన్న స్వచ్చంధ సంస్ధలు చెబుతున్నాయి. మేధావుల ప్రసంగాలకు, అమలుకు మద్య పొంతన ఉండటం లేదని వారు చెబుతున్నారు. మనిషి భూమికి చెందుతాడా భూమి మనిషికి చెందుతుందా అని ప్రశ్నించుకుంటే మనిషే భూమికి చెందుతాడని కాని మనిషి భూమిని, దానిలోని సహజసిద్దమయిన సంపదను దోచుకుంటున్నాడని వారు ఆగ్రహిస్తున్నారు. ఇదివరలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అభివద్దినే లక్యంగా చూపుతూ గిరిజన హక్కుల్ని వారు కాలరాస్తున్నారని ఆదివాసీలకు మనుగడ లేకుండా చూస్తున్నారని ప్రముఖ స్వచ్చంధ సంస్ధలు అభిప్రాయపడ్డాయి. గనుల తవ్వకం, డ్యామ్ లు, విద్యుత్ కేంద్రాలు,పోర్టులు, పరిశ్రమలు నిర్మాణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణానికి దానిపై నివసించే ప్రజలకు వారి హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయన్నారు. జీవవిద్యంసానికి స్వస్తి చెప్పి, ఆర్దిక విధానాలను తిరగరాస్తే తప్ప భారత్ హామీలు అమలయ్యే పరిస్థితి ఉంటుందని అప్పుడే హైదరాబాద్ లో నిర్వహిస్తున్న జీవవైవిద్య సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంటుందని వారు తెలిపారు.