రాజాను పట్టించుకోవడం లేదు!

 

 

 

 

2జీ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్, చిదంబరంలకు జేపీసీ క్లీన్‌చిట్ ఇచ్చింది. వారికి చెప్పకుండా విధాన నిర్ణయాలను రాజా మార్చేశారని తప్పుబట్టింది. 2జీ నష్టాన్ని అంచనా వేయడంలో కాగ్ కుట్రపూరితంగా వ్యవహరించిందని తప్పుబట్టింది. ఇప్పుడు ఈ నివేదిక రాజకీయంగా కలకలం రేపుతోంది. జేపీసీ చైర్మన్ చాకోపై ప్రతిపక్షాలు మండిపడుతుంటే.. ఆయన వాదన తప్పని రాజా స్పష్టం చేస్తున్నారు.

 


స్పెక్ట్రమ్ కేటాయింపునకు సంబంధించిన అన్ని నిర్ణయాలనూ ప్రధాని మన్మోహన్‌సింగ్ అనుమతితోనే తీసుకున్నానని టెలికం శాఖ మాజీ మంత్రి, 2జీ స్కాంలో నిందితుడు ఎ.రాజా స్పష్టం చేశారు. మన్మోహన్, చిదంబరంలకు జేపీసీ క్లీన్‌చిట్ ఇచ్చిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడారు. "జేపీసీకి సోమవారం 200 పేజీల సవివర నివేదిక పంపుతాను. నా నివేదికను పరిశీలించిన తర్వాత అయినా జేపీసీ తనను పిలుస్తుందని భావిస్తున్నాను.'' అని తెలిపారు. 2జీ వ్యవహారమంతా చట్ట వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు.

Teluguone gnews banner