జగన్ వేటగాడు..
posted on Mar 4, 2021 @ 2:08PM
వైసీపీ రౌడీల పార్టీ. జగన్‌ది వేటగాడి మనస్తత్వం. పావురాలకి ఆహారాన్ని వేస్తారు, అది పావురాల మీద ప్రేమతో కాదు, ఆ
పావురాల మాంసం కోసం. ఇదే జగన్ తీరు అంటూ ఏపీ సీఎంను వేటగాడితో పోల్చారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. జగన్ అధికారంలోకి వస్తే అరాచక పాలన వస్తుందని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే జరుగుతోందని గుర్తు చేశారు తులసీరెడ్డి.
పనిలో పనిగా మిగతా ప్రతిపక్షాలనూ ఏకిపారేశారు తులసీరెడ్డి. వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలు బీజేపీకి తోక పార్టీలన్నారు. ఆంధ్రలో కుస్తీ.. హస్తినలో దోస్తీ.. అంటూ కమలనాథులపై కస్సుమన్నారు. బీజేపీ చంకలో జనసేన అధినేత
పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు. జనం లేని పార్టీ జనసేన అంటూ విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బినామీలు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరి పార్టీ అన్నారు తులసిరెడ్డి.