భర్త ఎఫైర్.. భార్య అటాక్..
posted on Mar 4, 2021 @ 1:36PM
వాళ్ళిద్దరిది ప్రేమవివాహం. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరోయువతితో అక్రమ సంబంధం స్టార్ట్ చేశాడు. ఆ విషయం తెలుసుకున్న భార్య భర్తను పలకరిస్తే అదేం లేదని బుకాయిస్తూ, భార్యకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక అంటే భార్య . ఓ రోజు కాపుకాసి భర్తను, అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో కలిసి ఉండడం చూసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇంకేముంది బందువులకు కబురు పెట్టి ఆ తర్వాత ఇద్దరికి బడితపూజ చేసింది.
ఈ ఘటన కొత్తగూడెం, గాజులరాజాం బస్తీలో వెలుగులోకి వచ్చింది. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలలుగా రాజు.. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్తపై అనుమానం రావడంతో భార్య నిలదీసింది. అదేంలేదంటూ తప్పించుకున్నాడు. దీంతో భర్తపై ఆమె నిఘా పెట్టింది. వేరే యువతి ఇంటికి భర్త వెళ్లిన తర్వాత బయట గెడ పెట్టి.. బంధువులకు ఫోన్ చేసింది. వారిముందే భర్తతోపాటు ఆ యువతిని చితకబాదింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తరలించారు.