ఏంట్రా అన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే... చుక్కలు చూపిన పోలీసులు
posted on Nov 7, 2021 @ 9:21PM
అతనో అధికార పార్టీ ఎమ్మెల్యే. అధికార దర్పాన్ని పోలీసులపై చూపించారు. తనను అడ్డుకున్నారంటూ రెచ్చిపోయారు. ఏంట్రా అంటూ నోరు జారారు. దీంతో పోలీసులు సదరు ఎమ్మెల్యేకు చుక్కలు చూపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఏది పడితే అది మాట్లాడుతావా అంటూ కౌంటరిచ్చారు. దీంతో చేసిది లేక అక్కడి నుంచి జారుకున్నారు ఆ ఎమ్మెల్యే.
సీఎం కేసీఆర్ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మకు సందర్భంగా ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. శాంతమ్మ సమాధి వద్ద ఆమెకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. అయితే శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం వాహనం అనుమతి సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉంది. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతం లో పార్క్ చేసి సమాధి వద్దకు నడుచుకుంటూ పోవాలి..
అక్కడ అందరు నిబంధనలు ప్రకారమే నడుచుకున్నారు. కానీ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రం తన వాహనాన్ని సమాధి వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు..పోలీసులు మాత్రం నిబంధనలు కు విరుద్ధంగా వ్యవహరించం అని మర్యాదపూర్వకంగా చెప్పడం తో గువ్వల బాలరాజు నిస్సహాయ స్థితిలో ఉండి పోలీసు అధికారులను ఏంట్రా అని నోరు జరారు. అంతే పోలీసు అధికారులు యం.ఎల్.ఏ బాలరాజుకు ఏంట్రా అంటారా మీరు అధికారులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ చుక్కలు చూపారు. తర్వాత బాలరాజు చేసేది ఏమి లేక తన అనుచరుల తో కాలి నడకన సమాధి వద్దకు చేరుకున్నారు.