బాబు, షర్మిలా కబడ్దార్ : హరీష్ రావు
posted on Dec 12, 2012 @ 6:18PM
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాసిన లేఖ ఫై టిఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. ఆ పార్టీ నేత హరీష్ రావు మాట్లాడుతూ ఆ సమావేశానికి ముందే అన్ని పార్టీలు తమ వైఖరులను స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సమావేశానికి ప్రతి పార్టీ నుండి ఎంత మంది వెళ్ళారన్నది ముఖ్యం కాదని, ఆయా పార్టీలు ప్రత్యెక తెలంగాణా కు అనుకూలంగా మాట్లాడాయా లేదా అనేది ముఖ్యమని హరీష్ అన్నారు. ఇంత వరకు ప్రత్యేక వాదం అవలంభించిన పార్టీలు ఈ సమావేశంలో కూడా అలాగే తమ అభిప్రాయాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారు తెలంగాణా కు అనుకూలమో, కాదో ఈ సమావేశంలో తేలిపోతుందని ఆయన అన్నారు.
తెలుగు దేశం, వై ఎస్ ఆర్ పార్టీల అగ్ర నేతలు తెలంగాణా లో పాద యాత్ర లు చేస్తూ, తాము తెలంగాణా కు అనుకూలమని ప్రకటనలు చేస్తున్నారని, ఈ రెండు పార్టీలు సమావేశంలో కూడా తెలంగాణా కు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని చెప్పక పొతే, వారిని తెలంగాణా పోలిమేరల్లోకి తెలంగాణా ప్రజలు తరిమి కొడతారని హరీష్ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ మరో సారి ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. సమావేశం తేది దగ్గర పడుతుండడంతో, కాంగ్రెస్, టిడిపి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతల ఫై టిఆర్ఎస్ నేతలు వత్తిడి పెంచే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్లు అగుపిస్తోంది.