జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే వనిత ములాఖత్
posted on Dec 13, 2012 9:09AM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం తెలుగు దేశం పార్టీ ఎంఎల్ ఏ తేనేటి వనితా చంచల్ గూడ జైలులో జగన్ మోహన్ రెడ్డి ని కలిసారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడడమే తెలుగు దేశం పార్టీ అజెండాగా మారిందని ఆమె ఆరోపించారు. ఎఫ్ డి ఐ ల ఫై ఓటింగ్ సమయంలో ఇది రుజువయిందని ఆమె అన్నారు. ఆ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కు అయిన తర్వాతి పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. ఆ ముగ్గురు ఎంపి లఫై చర్య తీసుకోలేని పార్టీ నాయకత్వం తనను మాత్రం అకారణంగా సస్పెండ్ చేసిందని ఆమె అన్నారు. తన ఫై తీసుకున్న చర్యకు పార్టీ ఇంత వరకూ తనకు వివరణ ఇవ్వలేదని ఆమె అన్నారు. పార్టీలో డబ్బున్నవారికి ఒక న్యాయం, లేని వారికి మరొక న్యాయం అమలు జరుగుతోందని ఆమె ఆరోపించారు.
దివంగత వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రజల మనసుల్లో చిరకాలంగా ఉండిపోతాయని ఆమె అన్నారు.