కేజ్రివాల్ కు మద్దతు ప్రసక్తే లేదు: హజారే
posted on Dec 12, 2012 @ 4:46PM
తన నుండి విడిపోయి ‘ఆం ఆద్మీ పార్టీ’ పెట్టుకోన్న అరవింద్ కేజ్రివాల్ కు ఎట్టి పరిస్తితుల్లోను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అన్నా హజారే స్పష్టం చేశారు. కేజ్రివాల్ పట్ల మారిన తన వైఖరిని అన్నా సమర్ధించుకొన్నారు.
గతంలో ఒక సమయంలో మాట్లాడుతూ ’ఆం ఆద్మీ పార్టీ’ లోని సత్ప్రవర్తన కలిగిన వారికి తాను మద్దతు ఇస్తానని అన్నారు. అయితే, ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ, కేజ్రివాల్ పదవీ వ్యామోహంతో ఉన్నారని ఆయన పార్టీకి తాను ఓటు కూడా వేయనని అన్నారు. మారిన ఈ వైఖరికి తాను సమయం వచ్చినప్పుడు కారణం చెపుతానని అన్నా వెల్లడించారు. మారిన వైఖరికి ఈ సమయంలో సమదానమిస్తే, కొన్ని సమస్యలు వస్తాయని, అందువల్ల తరువాత ఈ అంశం గురుంచి ఓ ప్రకటన చేస్తానని అయన అన్నారు.
తాను సరి అయిన మార్గంలోనే వెళుతున్నానని అన్నా భావించినప్పుడు తనకు అన్నా మద్దతు ఇస్తాడని కేజ్రివాల్ చేసిన ప్రకటనను గుర్తు చేయగా, కేజ్రివాల్ పగటి కలలు కంటున్నట్లుగా ఉన్నారని అన్నా సమాధానమిచ్చారు.
పార్లమెంట్ ను రద్దు చేయాల్సిన సమయం వచ్చిందని అన్నా అభిప్రాయం వెల్లడించారు. జనవరి 30 నుండి పాట్నా నుండి అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తానని హజారే వెల్లడించారు.