హీరోయిన్ త్రిష తండ్రి కృష్ణన్ మృతి
posted on Oct 19, 2012 @ 2:39PM
హీరోయిన్ త్రిష తండ్రి కృష్ణన్ గుండె పోటుతో మృతి చెందారు. కృష్ణన్ కి నిన్న సాయంత్రం సడన్ గా గుండె నొప్పి రావడంతో యశోదా హాస్పటల్ కి తీసుకొని వెళ్ళారు. ఆయన దారిలోనే మరణించారని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే త్రిష, ఆమె తల్లి ఉమ హుటాహుటిన చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్‌లోనే కృష్ణన్ అంత్యక్రియలు ఉంటాయని ఉమ చెప్పారు. కృష్ణన్‌కు త్రిష ఒక్కర్తే కుమార్తె. కృష్ణన్ హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనజర్ గా పనిచేస్తున్నారు.