పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకున్న తెలంగాణవాదులు
posted on Oct 19, 2012 @ 2:18PM
పవన్ కళ్యాణ్ కెమెరామన్ గంగతో రాంబాబు సినిమా తెలంగాణ వాదాన్ని కించ పరిచే విధంగా ఉందంటూ..వెంటనే ఎక్కడిక్కడ ప్రదర్శన అక్కడే ఆపేయాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓయూ విద్యార్థులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో ప్రింట్ ను ఎత్తుకెళ్లిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో రాంబాబు ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర తెలంగాణ వాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ లో సినిమా ఫ్లెక్సీలను తెలంగాణవాదులు దగ్ధం చేశారు. ప్రత్యేక తెలంగాణ నినాదానికి వ్యతిరేకంగా ఈ సినిమా రూపొందించారంటూ కొంతమంది ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.