పుట్టిన రోజున దేవి గుడికి వెళ్లి.. ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోయారు..
posted on Jun 26, 2021 @ 12:45PM
ఆ రోజు బాబు పుట్టిన రోజు. పుట్టిన రోజు గుడికి వెళ్లడం మన భారతీయుల ఆనవాయితీ. దేవుడి దగ్గరికి వెళ్లి ఆయుషారోగ్యులు ఇవ్వమని దేవుడ్ని సహజంగా మొక్కుకుంటారు. దేవుడి దగ్గరికి వెళ్లి వెళ్లారు కనుగ తమకు ఏం జరిగిన దేవుడు కాపాడుతాడని నమ్మకం తో ఉంటారు. ఎవరైన. కానీ దేవుడి దగ్గరికి వెళ్లే దారిలోనో, తిరిగి వచ్చే దారిలోను ఏదైనా జరిగి ప్రాణాలు కూలిపోతే దేవుడు ఉన్నాడు అనాలా? లేదు అని గుర్తించేలా? ఇలాంటి సంఘటలను చాలా జరిగాయి వినాయక చవితి కి, అయ్యప్ప మాల వేసినపుడు కూడా చాలా మంది చనిపోయిన సంఘటనలు మన కళ్ల ముందు చాలానే ఉన్నాయి. తాజాగా దేవుడి దర్శనానికి వెళ్లిన వాళ్ళు ఘోర ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. ఈ విషాద సంఘటన బలరాంపూర్-తులసిపూర్ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. మృతులు గోండ జిల్లాలోని మన్హానా గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ సింగ్ (38), స్నేహలత (35), శత్రోహన్ కుమార్ (30), సౌమ్య (18), లిల్లీ (14), ఉత్కర్ష్ (12)గా గుర్తించినట్టు బలరాంపూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉత్కర్ష్ జన్మదినం సందర్భంగా దేవీ ఆలయానికి వెళ్లి దర్శనం తీసుకోవడానికి వెళ్తుండగా లోక్‌హవా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఓ ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో కారు చెరువులోకి దూసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చెరువులోకి దూసుకెళ్లిన కారు నీటిలో మునిగిపోవడంతో అందులో ఉన్న ఆరుగురిని గ్రామస్థుల సాయంతో బయటకు తీసుకొచ్చారు. సౌమ్య, లిల్లీ కొన ఊపిరితో బయటపడినప్పటికీ ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు విడిచారని తెలిపారు. ఈ ఆరుగురిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్పీ అరవింద్ కుమార్ మిశ్రా వెల్లడించారు.