లోకేష్ పోరాటం.. పీఆర్సీ రగడ.. ఒమిక్రాన్ వచ్చేసింది.. టాప్ న్యూస్@1PM
posted on Dec 15, 2021 @ 11:51AM
మంగళగిరిలో పేదలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి తహాశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పేదల ఇళ్ల తొలగింపు నోటీసును ఉపసంహరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మంగళగిరిలో నిర్మిస్తున్న డివైడర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోకేష్ వస్తే పేదల ఇల్లు తొలగిస్తారు అని చెప్పి ఓట్లు వేయించుకున్నారని... అదే పని ఎమ్మెల్యే ఆర్కే చేస్తున్నాడని లోకేష్ యెద్దేవా చేశారు.-------ఉద్యోగులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. 14.29 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినా ప్రభుత్వంపై రూ. 4వేల కోట్ల అధనపుభారం పడుతుందని అధికారవర్గాలు అంటున్నాయి. మంగళవారం ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వ సలహాదారు సజ్జలకు మధ్య చర్చల సందర్భంగా కూడా ఇదే ప్రస్తావన వచ్చింది. అయితే ఆ లెక్కలు తప్పని ఏపీజేఏసీ, ఏపీ ఎన్జీవో ఉద్యోగసంఘాల నేతలు అన్నారు.
-------
సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో అప్పీల్ దాఖలైంది. ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని ఏజీ హైకోర్టును కోరారు. సినిమా టికెట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేసింది..
-----
అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ నుంచి సర్కిల్ 3 కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతోంది. జై అమరావతి.. ఒకటే రాజధాని.. అమరావతే రాజధాని అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
------
చెడ్డీ గ్యాంగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‍ని గుజరాత్, మధ్యప్రదేశ్‍లకు పంపగా... ఫుటేజ్‍లోని చెడ్డీ గ్యాంగ్ దుండగులను పోలీసులు గుర్తించారు. గుజరాత్‍లోని దాహోద్‍లోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులుగా తెలుస్తోంది. దీంతో దాహోద్ ఎస్పీతో బెజవాడ సీపీ రాణా ఫోన్‌లో మాట్లాడారు.
-------
తెలుగు రాష్ట్రాల మాజీ గవర్నర్ నరసింహన్ అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. మరో 3-4 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంది. నరసింహన్ ను పరామర్శించిన అనంతరం కేసీఆర్ చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.
--
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలంగాణకు వచ్చేసింది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించినట్లు హెల్త్ డెరైక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
-----
ఒమైక్రాన్ వేరియంట్ వల్ల ప్రాణభయం లేదని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒమైక్రాన్ వేరియంట్‌తో ప్రజలు ఆందోళన చెందొద్దని.. జాగ్రత్తలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్ ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-----
హైదరాబాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. కరెంట్ కట్ చేసింది. స్టేడియానికి సంబంధించి ఇప్పటిదాకా రూ.కోటికిపైగా కరెంట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ కొన్ని నెలలుగా చెబుతున్నా పట్టించుకోకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపేశామని ఏడీఈ బాలకృష్ణ తెలిపారు.
---------
గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులను జాబ్ లో నుంచి తీసేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ సర్క్యులర్ ను జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగులంతా తమతమ వ్యాక్సినేషన్ వివరాలను డిసెంబర్ 3 నాటికి సమర్పించాలని, టీకా వేసుకోని వారెవరైనా ఉంటే వచ్చే ఏడాది జనవరి 18లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని డెడ్ లైన్ పెట్టింది.
--------