దమ్ముందా జగన్.. అఖండ అదుర్స్.. కేటీఆర్ బినామీ ఆయనేనా.. టాప్ న్యూస్@7PM
posted on Dec 11, 2021 @ 6:16PM
ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలను రాజీనామా చేయమనండి.. మా ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. వైసీపీ అవకాశవాద రాజకీయాలతో రాష్ట్రం భ్రష్టుపట్టి పోతోందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రం మెడలు వంచుతామని నాడు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు. ఇప్పుడు ఎందుకు పోరాడరని చంద్రబాబు ప్రశ్నించారు.
--------
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మూవీని తాను చూసినట్లు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అనేది ‘అఖండ’ సినిమాలో చూపించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో దాన్ని ‘అఖండ’ సినిమాలో చూపించారని, సినిమా చాలా బాగుందని చంద్రబాబు ప్రశంసించారు
-------
కోర్టులపై జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయని తెలిపారు. జగన్ సర్కార్ తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలపై జస్టిస్ చంద్రు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. జస్టిస్ చంద్రుతో న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడించినట్లు ఉందన్నారు.
-------
రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సభను ఇండోర్‌గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అమరావతి జేఏసీ అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. టీటీడీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల, ప్రజా సంఘాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మహాపాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతివ్వడం లేదని ఆయన అన్నారు.
--
శ్రీవారు కొలువై ఉన్న తిరుమల కొండకు మూడో ఘాట్ రోడ్డును నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ పాలకమండలిర్ణయాలను ఆయన వెల్లడించారు. అన్నమయ్య నడిచొచ్చిన మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. జనవరి 13న వైకుంఠ ఏకాదశి దృష్ట్యా 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
-----
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. పంటకు తగిన మద్దతు ధర లేకపోవడంతో ఉల్లిపై పెట్రోల్ పోసి రైతులు నిప్పంటించారు. గిట్టుబాటు ధర కల్పిచటంలో ప్రభుత్వం విఫలమైందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఉల్లిపై స్పందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
----
అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమరుల స్థూపం కట్టడానికి కూడా పొద్దుటూరు వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు. అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే అమరుల స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారన్నారు
---
రైతుల ఉసురు తగిలి టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మోతబారి రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ రైతులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదన్నారు. రైతులను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం బోగడ భూపతిపూర్ ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్‌రావు, పరామర్శించారు.
--
ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆమెతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం బొగుడ భూపతిపూర్ కు చెందిన రవి ఆత్మహత్య చేసుకున్నాడు.
----
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినవని, పనులు చేసినవని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి ప్రకటనలు చేయడం తప్ప పనులు చేయడం రాదని, ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఖర్చు ప్రకటనలకే కేటాయించారని ఆయన ఎద్దేవా చేశారు.
---