కలిసిన జేసీ-పరిటాల... జగన్ పై ఉద్యోగులు వార్.. కేసీఆర్ - కిషన్ మిలాఖత్... టాప్ న్యూస్@7PM
posted on Nov 10, 2021 @ 6:25PM
టీడీపీ అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే.. టీడీపీ అభ్యర్థులకు వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పోలీసు రక్షణతో పాటు పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయాలని న్యాయవాది కోరారు
----------
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. లోకేశ్‌ను స్వాగతించేందుకు జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి, పరిటాల కుటుంబం నుంచి శ్రీరామ్ వచ్చారు. అక్కడ ఇద్దరూ కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. శ్రీరామ్‌ను దగ్గరకు తీసుకున్నారు. శ్రీరామ్ కూడా ప్రభాకర్ రెడ్డిని గౌరవించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లారు. జేస, శ్రీరామ్ ఆలింగనం చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
----------
విద్యార్థులపై పోలీసుల దాడి దారుణమని టీడీపీ నేత నారా లోకేష్ దుయ్యబట్టారు. విద్యార్థులను కొట్టి.. ఇప్పుడు కొట్టలేదని చెబుతున్నారని తప్పుబ్టారు. అసలు కాలేజీలోకి పోలీసులు ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని తెలిపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై సీఎం జగన్ కన్నేశారని లోకేష్ ఆరోపించారు. ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేట్ చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
---------
పీఆర్‌సీ నివేదిక కోసం ఉద్యోగ సంఘాల నేతలు ఎదురుచూస్తున్నారు. రెండో బ్లాక్ దగ్గర ఉద్యోగ సంఘాల నేతలు బైఠాయించారు. పీఆర్‌సీపై స్పష్టత ఇచ్చేవరకు వెళ్లమని నేతలు భీష్మించుకుర్చున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లిపోవాలంటూ పోలీసుల ఆదేశించారు. పీఆర్‌సీ నివేదిక వివరాలు వెల్లడించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు పీఆర్‌సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇస్తానని సీఎస్ తెలిపారు.
--------
మద్యం ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 400 లోపు మద్యం బ్రాండ్లపై 50 శాతం వ్యాట్ వసూలు చేయాలని నిర్ణయించారు. రూ. 400 నుంచి రూ. 2,500 వరకు ఉన్న మద్యం కేసుపై 60 శాతం వ్యాట్... రూ. 2,500 నుంచి రూ. 3,500 వరకు ఉన్న మద్యం కేసుపై 55 శాతం వ్యాట్, రూ. 5 వేలు ఆపై ఉన్న మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలు చేయనున్నారు.
---
కేసీఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డి తరలించారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు లో బీజేపీ ఎన్నికల ఖర్చు అంత కేసీఆర్ పెట్టుకున్నాడని చెప్పారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ని మరోసారి చేసేందుకు కేసీఆర్ మోడీ తో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. యూపీలో ఎంఐఎం చేత వంద సీట్లకు పోటీ చేయించి ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
----
హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణాస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
----------
మంచిర్యాల జిల్లాలో మరోసారి బొగ్గు గని ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎస్సార్పీ-3 భూగర్భ బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లాలోని శ్రీరాంపూర్‌లోగల ఎస్సార్పీ- 3 బొగ్గు గనిలో ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. గనిలో పనిచేస్తున్న కృష్ణారెడ్డి, లక్ష్మయ్య, సూర్య నరసింహ రాజు, చంద్రశేఖర్ అనే కార్మికులపై గని పైకప్పు కూలింది. దీంతో వారు గనిలోనే మరణించారు.
---------
హైదరాబాద్ నగరంలోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావును పోలీసులు అరెస్ట్ చేసారు. శ్రీధర్‌రావుని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్‌రావు మోసం చేసాడు. దీంతో శ్రీధర్‌రావుపై రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసారు. భవన అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను శ్రీధర్ మోసగించాడు. భారీగా నగదును వసూలు చేసి కొనుగోలుదారులను శ్రీధర్ మోసం చేసాడు.
--
భారత దేశం నుంచి విమాన ప్రయాణాలపై ఆంక్షలను మరింత సడలించాలని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను గుర్తించాలని కూడా కోరారు. జీసీసీ సెక్రటరీ జనరల్ నయేఫ్ ఫలాహ్ ముబారక్ అల్-హజరఫ్‌తో ఆయన బుధవారం సమావేశమయ్యారు. వీరిద్దరూ భారత దేశం-జీసీసీ సంబంధాలపై సమీక్షించి, వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించారు.
---
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల నెలల పసిపాపకు అత్యాచార బెదిరింపులు చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కి చెందిన ఇతడిని విచారణ నిమిత్తం ముంబైకి తరలించారు. ప్రస్తుతం ముంబై సైబర్ సెల్ పోలీసుల అదుపులో కస్టడీలో ఉన్నట్లు ఓ ప్రకటనలో ముంబై పోలీసులు తెలిపారు.