జగన్ కు వాళ్లంటే భయమా.. పవన్ పై పాల్ ఫైర్.. కేసీఆర్ కు శాపనార్ధాలు.. టాప్ న్యూస్@7PM
posted on Nov 3, 2021 @ 7:37PM
అమరావతి కోసం రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న ఈ పాదయాత్రకు అండగా తెలుగు యువత కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించి.. వాళ్లతో సంఘీభావంగా పాదయాత్ర చేస్తున్నారు. గుంటూరులో మూడో రోజు పాదయాత్ర కొనసాగుతోంది.
--------
మంత్రివర్గాన్ని జగన్ ప్రక్షాళన చేయలేరని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి మహామహులున్నారని, వారిని తొలగిస్తే జగన్‌కు సమస్యలు తప్పవని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే పంచ్ ప్రభాకర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల మహాపాదయాత్రపై సజ్జల వ్యాఖ్యలు రాజద్రోహమేనని చెప్పారు.
--------
రుషికొండలో హరిత రిసార్ట్స్ కూల్చివేసి అక్కడ ఏం నిర్మించాలనుకున్నారో సీఎం జగన్ చెప్పాలని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. రుషికొండలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న పనుల వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విడిది కోసమే అక్కడ నిర్మాణం చేపడుతున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
------
రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు భయానక వాతావరణంలో జరగనున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ ఆందోళన వ్యక్తంచేశారు.ఇటీవల జరిగిన తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల్లో వైసీపీ రిగ్గింగ్, బూత్‌ల స్వాధీనం వంటి చర్యలకు దిగిందని ఆరోపించారు. 600 బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించారన్నారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లోను ఇదే జరుగుతుందని మాధవ్ హెచ్చరించారు.
---
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కేఏ పాల్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పవన్ సినిమా డ్రామాలు ఆపాలన్నారు. ఓటు బ్యాంక్ కోసమే పవన్ స్టీల్‌ప్లాంట్ దగ్గర డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ‘‘చిత్తశుద్ధి ఉంటే నా దగ్గరకు రా.. కలిసి పోరాడుదాం.’’ అని సూచించారు. దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీకి సపోర్టు చేస్తూ డ్రామాలా? అని ప్రశ్నించారు,
--------
ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ప్రజలు దీపావళి పండగను దేశీయ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. దీపావళి పండగ సందర్బంగా గవర్నర్ తెలంగాణ ప్రజలకు గ్రీటింగ్స్ చెప్పారు. దీపావళి పండగ చెడుపై మంచి సాధించిన విజయంగా, విజయానికి ప్రతీక దీపావళి పండగ అని అన్నారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
--------
ఉప ఎన్నికలో హుజూరాబాద్ ప్రజలను అన్ని రకాలుగా భయబ్రాంతులకు గురి చేశారని, తనపై కుట్రలు చేసిన వారు కుట్రలతోనే నాశనమైపోతారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వచ్చిన కష్టం శత్రువుకు కూడా రావద్దన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో రెండు గుంటల మనిషి 400 కోట్లు ఎలా ఖర్చుపెట్టాడని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో కేసీఆర్ అహంకారంపై ప్రజలు గెలిచారని తెలిపారు.
--------
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం, దేవన్నపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్ సభ కోసం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు, అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. పంట పొలాల్లో సభను నిర్వహించవద్దంటూ ఆందోళన చేపట్టారు.టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించేందుకు వరంగల్‌లో భారీ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
-------
'యావత్ దేశం మీతో ఉంది'' అని బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్నప్పుడు అతని తండ్రి షారూక్ ఖాన్‌కు సినీ పరిశ్రమ దిగ్గజాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని అధికార శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నుంచి మద్దతు లభించింది.
--------
రామజన్మభూమి ట్రస్టు నిధులు రూ.3,000 కోట్లు దాటడంతో లెక్కల నిర్వహణ బాధ్యతను ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ట్రస్టు అప్పగించింది. లెక్కల నిర్వహణ కోసం అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్టు తెలుస్తోంది. భూముల ఒప్పందాలపై ఇటీవల వివిదాలు తలెత్తిన క్రమంలో నిధుల నిర్వహణ బాధ్యతను టీసీఎస్‌కు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.