నమో మోదీ.. వైసీపీ దాదాగిరి.. టీమిండియా కీలక మ్యాచ్.. టాప్‌న్యూస్ @ 1pm
posted on Nov 5, 2021 @ 12:48PM
1. ప్రధాని మోదీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల ఎత్తైన ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు చేసి 'ఆరతి' నిర్వహించిన అనంతరం మోదీ శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
2. అనంతపురం జిల్లా పామిడి, మిడుతూరులో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పామిడిలో జీవనోపాధి కోసం కూలీ పనులకు వెళ్తున్న ఐదుగురిని మృత్యువు కబలించడం బాధాకరమన్నారు. మిడుతూరులో పాదాచారులు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందడం విచారకరమని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
3. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల పైసా వసూల్ బెదిరింపులు హద్దు మీరుతున్నాయి. ఆఖరికి దీపావళి టపాసుల దుకాణాల నుంచీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, 30 వ వార్డు కార్పొరేటర్ సైఫుల్లా బేగ్ అనుచరులు ఒక్కో దుకాణానికి రూ.35 వేల చొప్పున బలవంతంగా వసూళ్లు చేశారు. డబ్బు వసూళ్లు చేస్తున్న నేతల వీడియోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
4. తూర్పుగోదావరి జిల్లాలో గిరిజన మహిళను వైసీపీ నేత బెదిరించడం కలకలం రేపుతోంది. కూనవరం మండలం కాచవరం పంచాయతీ ఒకటో వార్డుకు శిరీష అనే గిరిజన మహిళను నామినేషన్ వేశారు. శిరీష్ నామినేషన్ వేయడంపై వైసీపీ ఉప సర్పంచ్ చామంతుల వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
5. ఐదోరోజు అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రత్తిపాడులో ఘన స్వాగతం లభించింది. స్థానికులు ఎద్దులతో స్వాగతం పలికారు. స్కూల్ స్టూడెంట్స్ పాదయాత్రలో ఉత్సాహం నింపారు. టీడీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం సైతం మహా పాదయాత్రలో భాగస్వామ్యమయ్యారు.
6. టోల్ ఫీజు అడిగినందుకు సిబ్బందిని చితక్కొట్టారు వైసీపీ రౌడీ మూకలు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్ దగ్గర జరిగిందీ ఘటన. పాయకరావుపేటకు చెందిన కొందరు వైసీపీ నాయకులు కారులో టోల్ గేట్ దగ్గరికి రాగా.. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ఫీజు చెల్లించాలని అడిగారు. తాము వైసీపీ నేతలమని.. ప్రజా ప్రతినిధులమని.. తమనే టోల్ రుసుం అడుగుతారా? అంటూ వారితో గొడవకు దిగారు. రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో టోల్‌గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
7. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరో భారీ ఉద్యమానికి వేదిక కానుంది. తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగురవేసే విధంగా నిరుద్యోగ సైరన్‌కు విద్యార్థి సంఘాలు కసరత్తు మొదలుపెట్టాయి. అప్పుడు తెలంగాణ కోసం.. ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దించడం కోసం ఉద్యమం చేపడుతున్నట్లు నిరుద్యోగ జేఏసీ చెబుతోంది. 20 విద్యార్థి సంఘాలు ఒకే వేదిక మీదకు వచ్చి ఐక్యకార్యాచరణ ప్రకటించనున్నాయి.
8. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ. 8 కోట్లకు ఐపీ పెట్టాడు. ఉయ్యాలవాడలోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న పాలది శేఖర్‌రావు చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం, కూతురి పెళ్లి కోసం.. 8కోట్లు అప్పు చేశాడు. మొత్తంగా రూ. 8 కోట్లకు ఐపీ పెట్టడంతో.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
9. గుత్తా సుమన్ కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. తాను హైద్రాబాద్‌లో కెసినో ఆడించలేదని.. గోవా, శ్రీలంక, రష్యా, ఫ్రాన్స్‌లో ఆడిస్తున్నానని పోలీసుల ముందు గుత్తా సుమన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. బయట దేశాలకు వచ్చే వారిని మాత్రమే తీసుకెళ్లినా.. బర్త్‌డే పార్టీ కోసం ఫార్మ్ హౌస్ రెంట్‌కి తీసుకున్నారు. సుమన్ ఫోన్‌లో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల ఫోటోలుండటం కలకలం రేపుతోంది.
10. టీ20 వరల్డ్‌కప్‌లో శుక్రవారం కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా స్కాట్లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. రన్ రేట్ పెంచుకునేలా కోహ్లీ టీమ్ భారీ విజయం దక్కించుకోవాల్సి ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఓడితేనే భారత్‌కు సెమీస్ ఛాన్సెస్ ఉంటాయి.