స్కాట్లాండ్‌తో టీమిండియా కీలక మ్యాచ్.. గెలిస్తే వరల్డ్ కప్ మనదే..నా!
posted on Nov 5, 2021 @ 12:10PM
ఒక్క ఛాన్స్. ఒకే ఒక్క ఛాన్స్. టీమిండియా అంటే ఏంటో చూపిస్తామంటున్నారు. తామెందుకు నెంబర్ వన్ ఆటగాళ్లమో నిరూపిస్తామంటున్నారు. ముందు రెండు మ్యాచ్‌లు ఏదో అలా ఓడిపోయాం కానీ, కోహ్లీ టీమ్‌లో సత్తా ఏంటో చూపించి.. దుబాయ్‌లో దున్నేస్తామంటున్నారు. ఆ ఒక్క ఛాన్స్.. సెమీస్‌లో ఒకే ఒక్క ఛాన్స్.. సాధిస్తే చాలు.. ఇక వరల్డ్ కప్ మనదే అంటున్నారు. అంత ధీమాగా ఉన్నారు ఆటగాళ్లు. అభిమానులకూ మనోళ్లపై బోలెడంత నమ్మకం. ఏదో రెండు మ్యాచ్‌లు ఓడిపోయారని అలా ఫైర్ అయ్యారు కానీ.. ఫ్యాన్స్‌కు తెలుసు మన ప్లేయర్స్ ఎంతటి పోటుగాళ్లో.
టీ20 వరల్డ్‌కప్‌లో శుక్రవారం కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా స్కాట్లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. స్కాట్లాండే కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా గెలిచేస్తాం. కాకపోతే రన్ రేట్‌ను మాగ్జిమమ్ పెంచేసుకోవాలి.. అంటే భారీ విజయం సాధించాలి. సాధిస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఇప్పటికే అఫ్ఘనిస్తాన్‌పై భారీ విక్టరీతో మంచి ఫ్యామ్‌లోకి వచ్చిన టీమిండియా.. అదే జోరును కంటిన్యూ చేస్తూ పసికూన స్కాట్లాండ్‌నూ చంకలోపెట్టేసుకుంటుందని అంటున్నారు. స్కాట్లాండ్ మ్యాచ్‌తో భారత్‌కు సెమీస్ ఛాన్సెస్ మరింత మెరుగువుతాయి. కాకపోతే.. కండీషన్ అప్లై.
టీమిండియా స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధించడం ఎంత ముఖ్యమో.. అటు న్యూజిలాండ్ ఓడిపోవడమూ అంతే ఇంపార్టెంట్. మనం గెలిచి.. వాళ్లు ఓడితేనే.. సెమీస్ ఎంట్రీ ఈజీ అవుతుంది. లేదంటే.. ఆశలు గల్లంతే. ఇప్పటికే మంచి ఫ్యామ్‌లో ఉన్న న్యూజిలాండ్ అఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడం కుసింత కష్టమే. అయితే, ఇది ట్వంటీ-ట్వంటీ మ్యాచ్. ఇందులో ఏదైనా జరగొచ్చు. ఎవరి చేతిలో ఎవరైనా ఓడిపోవచ్చు. అలా భారత్‌కు కలిసొచ్చేలా న్యూజిలాండ్ ఓడితే.. టీమిండియా సెమీస్‌లో కుమ్మేయడం ఖాయం.. ఫైనల్ చేరడం పక్కా అంటున్నారు. అదే జరిగితే, షోయబ్ అక్తర్ అన్నట్టు.. తుది పోరు ఇండియా-పాకిస్తాన్‌ల మధ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పుడిక.. దుబాయ్ వేదికగా అసలు సిసలు దాయాదుల యుద్ధం చూడొచ్చు. పిక్చర్ అబీ బాకీ హై.