నమో మోదీ.. కేదార్‌నాథ్‌లో ఆదిగురు విగ్రహ ఆవిష్కరణ..
posted on Nov 5, 2021 @ 1:12PM
ప్రధాని మోదీ ఏది చేసినా ప్రత్యేకమే. దీపావళి నాడు బోర్డర్‌లో జవాన్లతో కలిసి పండగ చేసుకున్నారు నరేంద్రుడు. ఆ మర్నాడు ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రధాన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు చేసి 'ఆరతి' నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల ఎత్తైన ఆదిగురు శంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆది శంకరాచార్యుల సమాధితో పాటు ఎన్నో కట్టడాలు కొట్టుకుపోయాయి. వాటిని కేంద్రం పునర్నిర్మిస్తోంది. దీనిలో భాగంగా ఆది శంకరాచార్యుల సమాధికి మరమ్మతులు చేశారు. ఇక, 2019లో శంకరాచార్య విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఆదిగురు విగ్రహం 2 ఫీట్ల పొడవు, బరువు 35,000 కిలోలు. మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్.. క్లోరైట్ స్కిస్ట్‌తో విగ్రహం తయారు చేశారు. భీకర వర్షాలు, ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరిత్యం తలెత్తినా తట్టుకునేలా దీనిని రూపొందించారు.
ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం 130 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. కేథార్‌నాథ్ టెంపుల్ దగ్గర సరస్వతి రిటనింగ్ వాల్, ఘాట్స్, మంధాకిని రిటనింగ్ వాల్, తీర్థ్ పురోహిత్‌ల గృహ నిర్మాణాలు, గురుధ్ చట్టి బ్రిడ్జ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.