డ్రగ్స్ కేసులో టాప్ యాంకర్.. ఆమెపై ఎఫ్ఐఆర్..!
posted on Sep 9, 2021 @ 4:49PM
డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను మరోసారి షేక్ చేస్తోంది. కేసు ఎక్సైజ్ శాఖ పరిధి నుంచి ఈడీకి చేరడంతో ప్రముఖుల గుండెల్లో గుబులు రేపుతోంది. వరుసగా సినీ సెలబ్రిటీలను గంటల తరబడి విచారిస్తోంది ఈడీ. డ్రగ్స్ డీలర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, బ్యాంకు ద్వారా కెల్విన్‌కు నగదు బదిలీ లావాదేవీలపై ప్రధానంగా ప్రశ్నిస్తోంది. ఈసారి కొత్తగా రానా, రకుల్‌ప్రీత్‌లు కూడా డ్రగ్స్ కేసులో ఈడీ ఎంక్వైరీని ఎదుర్కోవడం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్‌లో కంటే శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు మరింత ప్రకంపణలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు కన్నడ సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా, మరోసారి శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. బెంగళూరు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ప్రముఖ కన్నడ నటి, యాంకర్ అనుశ్రీ పేరు ఉండటం కన్నడనాట సంచలనంగా మారింది.
గతంలోనూ అనుశ్రీ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా.. మత్తు పదార్థాలు సరఫరా చేస్తోందని కొరియోగ్రాఫర్లు తరుణ్, కిషోర్‌లు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పటికే ఆ కేసులో కిషోర్, తరుణ్‌లు అరెస్ట్ అయ్యారు. 2017లో ఈ ఇద్దరూ ఇచ్చిన వివరణ అధరంగా పోలీసులు విచారణ జరిపారు. ఆధారాలు దొరకడంతో తాజాగా నటి, యాంకర్ అనుశ్రీపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.