నాలుక వున్నది కోసుకోవడానికి కాదు.. ప్రశ్నించడానికి!
posted on May 12, 2024 @ 10:25PM
ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని వేంకటేశ్వర దేవాలయంలో ఒక వ్యక్తి నాలుక కోసుకున్నాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. నాలుక కోసుకునే ముందు అతను ఒక లేఖ రాశారు. అందులో ‘‘నా పేరు చెవల మహేశ్. మాది పశ్చిమ జిల్లా గూటల గ్రామం. నేను గతంలో రాజశేఖరరెడ్డి, జగన్ ముఖ్యమంత్రి కావాలని ఇక్కడే నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నా. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, పవన్, లోకేశ్ గెలవాలని నాలుక కోసుకున్నా’’ అని రాశాడు.
ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? దేశానికి కావలసింది ఇలాంటి వాళ్ళు కాదు.. ఇలాంటి వారి తెలివితక్కువ త్యాగాలు చూసి సంతోషించేవారు ఎవరూ లేరు. ఈయన ఎవరు ముఖ్యమంత్రి కావాలని నాలుక కోసుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోతారన్న భ్రమలేవో వున్నట్టున్నాయి. ఇలాంటి వారి మొక్కులు రాజశేఖర్ రెడ్డికి, జగన్‌కి కావాలేమోగానీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌కి అక్కర్లేదు. నాలుక వున్నది కోసుకోవడానికి కాదు.. ప్రశ్నించడానికి!!