జగన్‌కి పిఠాపురం ఎమ్మెల్యే షాక్!

ఎన్నికల ముందు రోజున జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే దొరబాబు ధిక్కార స్వరం వినిపించారు. పిఠాపురం నుంచి తప్పుకుని వంగా గీతకు సపోర్ట్ చేస్తే తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మినిస్టర్ చేస్తానని జగన్ హామీ ఇచ్చారని, అదే విధంగా వంగా గీతని కూడా మినిస్టర్ని చేస్తానని హామీ ఇచ్చారని, ఒకే నియోజకవర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవి ఎలా ఇస్తారు? నాకు ఇచ్చిన హామీ మోసమా లేక వంగా గీతకు ఇచ్చిన హామీ మోసమా అని దొరబాబు ప్రశ్నించారు. దొరబాబు తిరుగుబాటు చేయడంతో దొరబాబుకు సంబంధించిన ఓట్లు వంగా గీతకు పడవు అని తేలిపోయింది. దొరబాబు అదృష్టం ఏమిటంటే, వైసీపీ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టి, తనకు మంత్రి పదవి రాదు.. వంగా గీతకీ రాదు.. శుభం.

Teluguone gnews banner